Fees Burden On Medical Students: ఎంబీబీఎస్ సీట్ల విభజన.. పీజీ విద్యార్థులపై ఫీజుల భారం.. రాష్ట్ర ప్రభుత్వంపై జాడాల ఆగ్రహం - ప్రభుత్వ వైద్య కళాశాలలు
🎬 Watch Now: Feature Video
Fees Burden On Medical Students : వైసీపీ ప్రభుత్వం వైద్య విద్యార్థులపై ఫీజుల భారాన్ని పెంచుతూనే ఉంది. ప్రైవేట్ వైద్య కళాశాలల్లో ఎంబీబీఎస్(MBBS)లో మాదిరిగానే పీజీ ఫీజులు కూడా పెంచుతూ ఉత్తర్వులిచ్చింది. 2023-24 విద్యా సంవత్సరానికిగాను వార్షిక ఫీజులను గతేడాది కన్నా 15 శాతం పెంచుతున్నట్లు వైద్యారోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు వెల్లడించారు. హైకోర్టు తీర్పునకు లోబడి ఈ ఫీజుల పెంపు ఆధారపడి ఉంటుందని పేర్కొంటూ.. సూపర్ స్పెషాలిటీ కోర్సుల్లో.. పీజీ సూపర్ స్పెషాలిటీ కోర్సుల్లో ప్రవేశాలకు ‘ట్యూషన్’ ఫీజు కింద 17లక్షల25 వేల రూపాయలు తీసుకోవచ్చునని వైద్యారోగ్య శాఖ ఉత్తర్వులు ఇచ్చింది. ఈ పెంపు 5 ప్రైవేట్ కళాశాలలకు మాత్రమే వర్తిస్తుందని ఉత్తర్వల్లో స్పష్టం చేసింది.
ఎంబీబీఎస్ సీట్ల విభజన.. ఇప్పటికే ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ఎంబీబీఎస్ సీట్లను ఏ,బీ,సీ కేటగిరీలుగా చేసి విక్రయించటంపై వైద్య విద్యార్థులు (Medical Students) అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ జీవోను ఉపసంహరించుకోకుంటే నిరవధిక సమ్మె చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించిన ఏపీ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్.. ఈ జీవో పేద విద్యార్థులకు శాపంగా మారుతోందని తెలిపింది.