ప్రాణాలైనా పణంగా పెట్టి భూములను కాపాడుకుంటాం : జీవితాలను రోడ్డున పడేయొద్దంటూ రైతుల ఆందోళన - ఫ్యాక్టరీ ఏర్పాటు చేయడానికి నిరాకరించిన రైతులు
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Nov 27, 2023, 5:56 PM IST
Farmers Who Refused to Set up Factory : తమ భూములను ఫ్యాక్టరీ ఏర్పాటు చేయడానికి ఎలాంటి పరిస్థితుల్లోను ఇచ్చేందిలేదంటూ రైతులు ఆందోళన బాటపట్టారు. చిత్తూరు జిల్లా పలమనేరు ఆర్డీవో కార్యాలయం వద్ద పుంగనూరు మండలం గోపిశెట్టిరపల్లి రైతులు ధర్నా చేశారు. తరతరాల నుంచి సంక్రమిస్తున్న భూముల్లో ప్రభుత్వం ఫ్యాక్టరీని పెట్టేందుకు యోచనలో ఉన్న నేపథ్యంలో రైతులు నిరసనలు చేపట్టారు. ఫ్యాక్టరీ ఏర్పాటు చేయవద్దంటూ నినాదాలు చేశారు. ప్రభుత్వ తీసుకున్న నిర్ణయం కారణంగా.. వ్యవసాయన్నే నమ్ముకున్న కొన్ని వందల కుటుంబాలు రోడ్డున పడుతాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాణాలను పణంగా పెట్టినైనా తమ భూములను కాపాడుకుంటామని పేర్కొన్నారు.
ఇన్నాళ్లు వ్యవసాయంపైన ఆధారపడి జీవిస్తూ తమ కుటుంబాన్ని పోషిస్తున్న తమ జీవితాలు, పిల్లల చదువులు ఏం కావాలని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. ఈ ప్రాంతంలో నీటి వసతికి అనుకూలంగా ఉండటం వల్లనే ఫ్యాక్టరీ ఏర్పాటు చేయడానికి... ప్రభుత్వం యోచనలో ఉందని పేర్కొన్నారు. ఫ్యాక్టరీ ఆలోచనను విరమించుకొని తమ భూములను వదలివేయాలని.. రైతులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అనంతరం ఫ్యాక్టరీని వ్యతిరేకిస్తూ ఆర్డీవో సిబ్బందికి వినతిపత్రం ఇచ్చారు.