Farmers Faces Problems Due to Power Cuts: అప్రకటిత విద్యుత్ కోతలు.. ఎండుతున్న పంటలు.. ఆందోళనలో అన్నదాతలు - అనంతపురం జిల్లా లేటెస్ట్ న్యూస్
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 3, 2023, 7:36 PM IST
Farmers Faces Problems Due to Power Cuts: అప్రకటిత విద్యుత్ కోతలతో అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గ రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో 33వేల 3వందల విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. వాటి పరిధిలో దాదాపు 85 వేల ఎకరాల్లో మిరప, వేరుశనగ, కంది, పత్తి వంటి పంటలు సాగు చేశారు. వర్షాభావ పరిస్థితుల కారణంగా బోర్లు, బావులతో పాటు హంద్రీనీవా కాలువ నుంచి విద్యుత్ మోటర్లతో నీటిని పంటకు అందించాల్సిన పరిస్థితి ఏర్పడింది. హంద్రీనీవా కాలువలో నీరున్నా విద్యుత్ కోతల వల్ల పంటకు నీరందించడానికి ఇబ్బందులు పడుతున్నామని రైతులు వాపోయారు.
ప్రస్తుతం మిరప చాలా చోట్ల మొలక దశలో ఉంది. దానికి ఎంత బాగా నీరు అందింతే మొక్కలు అంత బాగా పెరగడానికి అవకాశం ఉంది. నీరు అందకపోవటంతో మిగతా పంటలు కూడా వాడిపోయే పరిస్థితి నెలకొంది. కరెంట్ ఎప్పుడు వస్తుందో తెలియక రాత్రింబవళ్లు పొలాల వద్దనే ఉండాల్సి వస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.