Farmers Complaint to Collector: ఆర్బీకేలో నాణ్యమైన విత్తనాలు లేవు.. కలెక్టర్కు రైతుల ఫిర్యాదు
🎬 Watch Now: Feature Video
Farmers Complaint To Collector About Fake Seeds : రైతు భరోసా కేంద్రాలలో నాణ్యమైన విత్తనాలు అందడం లేదని కొందరు రైతులు కలెక్టర్ వేణు గోపాల్ రెడ్డి ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం పాత మల్లాయపాలెంలో 'జగనన్న సురక్ష' కార్యక్రమంలో రైతులు కలెక్టర్ వద్ద సమస్యలను ఏకరువు పెట్టారు. గత సంవత్సరం రైతు భరోసా కేంద్రాలలో ఇచ్చిన శనగ విత్తనాలు మొలక శాతం చాలా తక్కువ వచ్చిందని కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. ప్రత్తిపాడు నియోజకవర్గంలో కొన్ని ప్రాంతాలలో నకిలీ మిరప విత్తనాలు తయారు చేస్తున్నారని, అధికారులు మాత్రం పట్టించుకోలేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్పందించిన కలెక్టర్ వ్యవసాయ శాఖ అధికారులతో మాట్లాడారు. మండలంలో ఉన్న అన్ని రైతు భరోసా కేంద్రాల్లో నాణ్యమైన విత్తనాలు ఉంచాలని, అవసరమైన వాటి కంటే ఎక్కువగా ఉంచాలని అధికారులకు సూచించారు. నకీలీ విత్తనాలు అమ్మకాలను నియత్రించడానికి తగిన చర్యలు తీసుకుంటామని రైతులకు ఆయన హామీ ఇచ్చారు. టాస్క్ పోర్స్ నియమించి నకిలీ విత్తనాల తయారీ కేంద్రాల్లో తనిఖీలు చేయాలని అధికారులను వేణు గోపాల్ రెడ్డి ఆదేశించారు.