Farmer Suicide: "నా చావుకు రెవెన్యూ అధికారులు, సీఎం జగన్ కారణం" - రైతు సుబ్బారెడ్డి లేఖ
🎬 Watch Now: Feature Video
Farmer Suicide in YSR District: వైఎస్ఆర్ జిల్లా ఖాజీపేట మండలం తుడుములదిన్నె గ్రామంలో సుబ్బారెడ్డి అనే రైతు అనుమానాస్పద మృతి కలకలం రేపింది. రైతు వద్ద ఉన్న సూసైడ్ లెటర్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తన చావుకు రెవెన్యూ అధికారులు, సీఎం జగన్ కారణమని సూసైడ్ లేఖలో రైతు సుబ్బారెడ్డి ఆరోపించారు. నిన్న సాయంత్రం రైతు తన పొలంలో విషగుళికలు తిని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కాగా, అతని శరీరంపై ఉన్న గాయాలను చూస్తే ఎవరో దాడి చేసినట్లు ఉందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. రైతు సుబ్బారెడ్డికి ఉన్న ఎనిమిది ఎకరాల చుక్కల భూమిని ఆన్లైన్ చేయకుండా రెవెన్యూ అధికారులు నిర్లక్ష్యం చేయడమే కాకుండా లంచం కూడా డిమాండ్ చేస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు.. తన చావుకు రెవెన్యూ అధికారులు, సీఎం జగన్ కారణమని రైతు లేఖలో పేర్కొన్నారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు..