Falling Flexi on Woman: ఫ్లెక్సీ మీద పడి మహిళకు తీవ్రగాయాలు.. గుంతకల్లులో ఘటన - Flexi incident

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jul 31, 2023, 9:57 AM IST

Falling Flexi on Woman in Guntakal : అనంతపురం జిల్లా గుంతకల్లులో ఫ్లెక్సీ మీదపడి ఓ మహిళలకు తీవ్ర గాాయాలయ్యాయి. ప్రయాణంలోనున్న ద్విచక్రవాహనంపై ఫ్లెక్సీ పడటంతో ఈ ప్రమాదం జరిగింది. రామగిరి మండలం ఎగువతండాకు చెందిన ఆంజనేయులు, ఆయన భార్య ఉమాదేవి.. ఓ ప్రైవేటు ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించుకుని ద్విచక్రవాహనంపై ఇంటికి వెళ్తున్నారు. అదే సమయంలో వీచిన ఈదురు గాలి ప్రభావానికి రోడ్డు పక్కన ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ ఎగిరివచ్చి.. వీరి వాహనంపై పడింది. దీంతో ఫ్లెక్సీని ఏర్పాటు చేసేందుకు కట్టిన కర్ర ఉమాదేవికి బలంగా తగిలింది. ఈ ఘటనలో ఉమాదేవి తలకు తీవ్రగాయాలయ్యాయి. రోడ్డుకు ఇరువైపులా ఏర్పాటుచేసిన ఫ్లెక్సీల కారణంగా తరచూ ప్రమాదాలకు గురవుతున్నామని వాహనదారులు వాపోతున్నారు. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు స్పందించి ఫ్లెక్సీల నియంత్రకు చర్యలు చేపట్టాలని వారు కోరుతున్నారు. ప్రజాసమస్యలను దృష్టిలో ఉంచుకుని ఫ్లెక్సీల ఏర్పాటుకు అనుమతినివ్వాలని అంటున్నారు.  ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. 

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.