Face To Face with Yarlagadda Venkata Rao: 'వల్లభనేని వంశీ వల్ల నష్టపోయిన టీడీపీ కార్యకర్తలకు అండగా ఉంటా' - లోకేశ్ సమక్షంలై వైసీపీ నేతల చేరికలు

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 22, 2023, 6:09 PM IST

ETV Bharat  Face To Face with Yarlagadda Venkata Rao: వల్లభనేని వంశీ వల్ల నష్టపోయిన ప్రతీ తెలుగుదేశం కార్యకర్తకు తాను అండగా ఉంటానని గన్నవరం తెలుగుదేశం నేత యార్లగడ్డ వెంకట్రావు స్పష్టం చేశారు. గన్నవరం(Gannavaram) యువగళం బహిరంగ సభకు యార్లగడ్డ వెంకట్రావు భారీ బైక్ ర్యాలీతో(Yarlagadda Venkatarao Bike Rally) తరలి వచ్చారు. రేపు యార్లగడ్డ వెంకట్రావు ఆధ్వర్యంలో లోకేశ్​ సమక్షంలో.. గన్నవరం నుంచి  వైసీపీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తెలుగుదేశంలో చేరనున్నారు. నారా లోకేశ్​ పాదయాత్ర(Nara Lokesh Padayatra)లో తెలుగుదేశంలో చేరానని, నిన్న తన నియోజకవర్గంలో పాదయాత్ర కావటంతో అక్కడ చేరానని వెంకట్రావు తెలిపారు. బుధవారం ఉదయం ఎస్ఎమ్ కన్వెన్షన్​లో కార్యకర్తల చేరిక ఉంటుందన్నారు. టీడీపీ కార్యకర్తలు, తన వెనక వైసీపీ నుంచి వచ్చిన కార్యకర్తలు సమన్వయంతో ముందుకు వెళ్తానని తెలిపారు. 2024 ఎన్నికల్లో ఖచ్చితంగా గెలిచి తీరుతానని ధీమా వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో యార్లగడ్డతో ఈటీవీ భారత్ ముఖాముఖి 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.