విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో.. జ్వరాలకు ప్రత్యేక వార్డు ఏర్పాటు.. - ఆంధ్రప్రదేశ్​ లేటెస్ట్​ న్యూస్​

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Mar 13, 2023, 12:19 PM IST

H3N2 VIRUS IN AP :  రాష్ట్రంలో వైరల్​ జ్వరాలు ఎక్కువవుతున్నాయి. ముఖ్యంగా H3N2(ఇన్​ఫ్లూయంజా) వైరస్​​ కేసులు అధికమవుతున్నాయి. అయితే ఈ వైరస్​ లపై​ అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ప్రభుత్వం హెచ్చరించింది. దీంతో విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో జ్వరాలకు ప్రత్యేక వార్డు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం జ్వరం, దగ్గుతో చాలా మంది వస్తున్నారని.. H3N2 వైరస్‌ తరహా లక్షణాలు ఉన్న కేసులు రోజూ 5 నుంచి 10 వస్తున్నాయని విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు చెబుతున్నారు. జ్వరం రాగానే చాలా మంది ఇంటి వద్ద సొంతంగానే ఔషధాలు వినియోగిస్తున్నారని చెబుతున్నారు. వైరల్‌ జ్వరాలకు యాంటీ బయోటిక్స్‌ వినియోగించొద్దని.. వైద్యుల సలహా మేరకే ఔషధాలు వినియోగించాలని చెబుతున్నారు. అసలు ఈ H3N2 వైరస్​, దాని లక్షణాలు ఏంటి, దానిని నివారించడానికి తీసుకోవాల్సిన జాగత్తలు, పాటించాల్సిన చర్యలపై ఎన్టీఆర్​ జిల్లా విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి వైద్యురాలు డాక్టర్‌ ప్రమీలా రాణి తో ఈటీవీ భారత్​ ప్రతినిధి ముఖాముఖి.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.