జగన్ బాధితుడు కాబట్టి.. కోర్టుకు రావాలి.. సాక్ష్యం చెప్పాలి: నిందితుడి లాయర్ సలీమ్ - కోడికత్తి కేసు తాజా వార్తలు
🎬 Watch Now: Feature Video
FACE TO FACE WITH KODI KATTI ACCUSED LAWYER: విశాఖ విమానాశ్రయంలో ప్రతిపక్షనేతగా ఉన్నప్పుడు జగన్‌పై కోడికత్తితో దాడి కేసు విచారణను విజయవాడ NIA కోర్టులో ఈనెల 13వ తేదీకి వాయిదా వేసింది. కేసులో ప్రత్యక్ష సాక్షి, బాధితుడిగా ఉన్న CM జగన్.. విచారణకు హాజరుకావాలని గత వాయిదాలో కోర్టు ఆదేశించింది. అయితే.. ఈ కేసులో అడ్వకేట్ కమిషనర్ ద్వారా సాక్ష్యం నమోదుకు అనుమతి ఇవ్వాలని.. సీఎం జగన్ ఎన్ఐఏ కోర్టులో 2 పిటిషన్లు దాఖలు చేశారు. సీఎంగా బాధ్యతల నిర్వహణ, సమీక్షలు ఉన్నాయని..కోర్టుకు హాజరైతే ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తుతాయని.. పిటిషన్‌లో వెల్లడించారు. మరోవైపు.. ఈ కేసు విచారణకు సీఎం హాజరుకాకపోవడాన్ని నిందితుడి తరఫు న్యాయవాది సలీమ్ తీవ్రంగా తప్పుపట్టారు. సీఎం అయినా, పీఎం అయినా రూల్ ఆఫ్ లా పాటించాలన్నారు. రావాలి జగన్.. చెప్పాలి సాక్ష్యం అని స్పష్టం చేశారు. ఈ కేసు విచారణకు సంబంధించిన పూర్తి వివరాలపై నిందితుడి తరఫు న్యాయవాది సలీంతో ఈటీవీ భారత్ ప్రతినిధి ముఖాముఖి..