అంబేడ్కర్ విగ్రహాన్ని అవమానించాడనే ఆరోపణలు- మాజీ ఆర్మీ ఉద్యోగి అరెస్ట్
🎬 Watch Now: Feature Video
Ex army employee arrested in Guntur: గుంటూరు జిల్లా పొన్నూరులోని అంబేడ్కర్ విగ్రహం వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. నిడుబ్రోలు చెందిన ముప్పవరపు శ్రీనివాసరావు గతంలో ఆర్మీలో పనిచేసి పదవీ విరమణ పొందారు. అనంతరం గుంటూరు ప్రాంతీయ గ్రంథాలయంలో ఉద్యోగం చేరారు. గత కొంత కాలంగా శ్రీనివాసరావు ఆరోగ్య పరిస్థితి బాగా లేకపోవడంతో, 5నెలల క్రితం, పీఎఫ్ మంజూరు చేయాలని ఉన్నతాధికారులను విజ్ఞప్తి చేశారు. శ్రీనివాసరావు విజ్ఞప్తిపై అధికారులు స్పందించకపోవడంతో, పొన్నూరు అంబేడ్కర్ విగ్రహం ఎక్కి నిరసన తెలిపారు.
ఐతే, డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ విగ్రహంపై ఆర్మీ ఉద్యోగి ముప్పవరపు శ్రీనివాసరావు మూత్రం పోశాడని ఆరోపిస్తూ దళిత సంఘ నాయకులు ఆందోళనకు దిగారు. పొన్నూరు ఐలాండ్ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహం వద్దకు భారీగా చేరిన దళిత సంఘాల నేతలు నిరసన తెలిపారు. దళిత నేతలు, వివిధ ప్రజా సంఘాల ఆందోళనతో రహదారిపై ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో అక్కడికి చేరుకున్న పోలీసులు వారికి సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. చివరకు శ్రీనివాసరావును అదుపులోకి తీసుకున్నారు. ఆరోపణలపై విచారణ చేస్తామని పోలీసులు తెలిపారు.