ప్రజలకు న్యాయం ఎందుకంత భారంగా మారుతోంది.. చేపట్టాల్సిన చర్యలేమిటి - etv Bharath
🎬 Watch Now: Feature Video
Pratidwani : నిందితుడు అన్నంత మాత్రాన అతడు నేరం చేసినట్లు కాదు. అరెస్టు చేసినంత మాత్రాన ఒకరు జైలు జీవితాల్లోనే మగ్గిపోవాల్సిన పనిలేదు. జరిగిన నేరం అతడే చేశాడని నిరూపణయ్యే వరకు.. ఎవరైనా నిర్దోషి కిందే లెక్క. అత్యంత కీలకమైన నేర న్యాయవ్యవస్థలో ఈ చిన్న మర్మం ప్రజలకు విడమరిచి చెప్పేది ఎవరు? కనీసం బెయిలుకు నోచుకోక విచారణ ఖైదీలుగా జీవితాలు ముగిస్తున్న అనేకమంది అభాగ్యులకు అండగా నిలిచి.. వారి హక్కుల్ని వారికి తిరిగి అందించేది ఎవరు? ఈ బృహత్తర బాధ్యతను నెరవేర్చాల్సిందీ.. అదే న్యాయవ్యవస్థ. పేదలకు, పరిమిత వనరులు కలిగిన వ్యక్తులకు ఉచితంగా న్యాయసేవలు అందించడం ఆధునిక సంక్షేమ రాజ్య ప్రాథమిక కర్తవ్యం. మరి ఆ స్ఫూర్తి క్షేత్రస్థాయిలో ఎలా అమలవుతోంది. న్యాయం కోసం పేదలు, బీదల భారమైన నిరీక్షణలు ఏం చెబుతున్నాయి? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.
Last Updated : Feb 3, 2023, 8:29 PM IST