ETV Bharat / offbeat

"బొమ్మిడాయిల పులుసు" - ఈజీగా చేసుకోవచ్చు కానీ, ఆ విషయంలో జాగ్రత్త! - BOMMIDAYILA PULUSU RECIPE

బొమ్మిడాయిలను ఇలా క్లీన్​ చేసి పులుసు పెట్టండి - రుచి అద్భుతంగా ఉంటుంది!

How to Make Bommidayila Pulusu
How to Make Bommidayila Pulusu (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 5, 2025, 2:45 PM IST

How to Make Bommidayila Pulusu : చాలా మంది ఫిష్​ ఫ్రై, పులుసు లొట్టలేసుకుంటూ తింటారు. కొర్రమీను, బంగారు తీగ, బొచ్చె ఇలా చేపల్లో చాలా రకాలే ఉంటాయి. వీటిలో బొమ్మిడాయిలు అంటే ఎక్కువ మందికి ఇష్టం. ఇవి ఎంతో రుచికరంగా ఉంటాయి. బొమ్మిడాయిలతో ఫ్రై, ఇగురు, పులుసు ఏది చేసినా టేస్ట్​ అద్భుతంగా ఉంటుంది. అయితే, ఎక్కువ మందికి బొమ్మిడాయిలను సరిగా క్లీన్​ చేయడం రాదు. దీంతో బొమ్మిడాయిల పులుసు చేయడానికి సాహసం చేయరు. వీటిని బాగా శుభ్రం​ చేయకపోతే కూర నీచు వాసన వచ్చి తినాలని అనిపించదు. అందుకే క్లీన్ చేసే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అయితే, ఈ స్టోరీలో చెప్పిన విధంగా బొమ్మిడాయిలను క్లీన్​ చేసి పులుసు చేస్తే ఎలాంటి స్మెల్​ లేకుండా కర్రీ టేస్ట్​ సూపర్​గా ఉంటుంది. మరి ఇక ఆలస్యం చేయకుండా బొమ్మిడాయిల పులుసు ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం.

కావాల్సిన పదార్థాలు :

  • బొమ్మిడాయిలు - కేజీ
  • ఉల్లిపాయలు - 6
  • పచ్చిమిర్చి - 8
  • కొత్తిమీర తరుగు - కొద్దిగా
  • చింతపండు - 100 గ్రాములు
  • నూనె - 4 టేబుల్​స్పూన్లు
  • ధనియాలు - 2 టేబుల్​స్పూన్లు
  • మెంతులు - టేబుల్​స్పూన్
  • జీలకర్ర - టేబుల్​స్పూన్
  • వెల్లుల్లి - 2
  • పసుపు - అరటీస్పూన్​
  • కారం - రుచికి సరిపడా
  • ఉప్పు - రుచికి సరిపడా
  • అల్లం పేస్ట్ - 2 టేబుల్​స్పూన్లు

తయారీ విధానం :

  • ముందుగా బొమ్మిడాయిల చేపలను శుభ్రంగా కడిగి, పొలుసులు లేకుండా కత్తితో కాస్త గీరుకోవాలి.
  • ఆపై కొద్దిగా ఉప్పు వేసి శుభ్రంగా కడుక్కోవాలి. చివరిగా కొద్దిగా పసుపు, నిమ్మకాయ రసం పిండి మరోసారి వాష్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇలా రెండుమూడు సార్లు క్లీన్ చేసుకుంటే ఎలాంటి నీచు వాసన ఉండదు.
  • ఇప్పుడు ఉల్లిపాయలు సన్నగా కట్​ చేసుకోవాలి. అలాగే పచ్చిమిర్చి మధ్యలోకి కట్​ చేసి పక్కన పెట్టుకోవాలి.
  • చింతపండు ఓ 15 నిమిషాలు నీటిలో నానబెట్టుకోండి.
  • తర్వాత ఒక మిక్సీ గిన్నెలో ధనియాలు, మెంతులు, జీలకర్ర, పొట్టు తీసిన వెల్లుల్లి వేసి కచ్చపచ్చాగా గ్రైండ్​ చేసుకోండి. అవసరమైతే నీళ్లు పోసుకోవచ్చు.
  • ఇప్పుడు స్టవ్​పై బొమ్మిడాయిల పులుసు చేయడం కోసం గిన్నె పెట్టండి. ఇందులో నూనె పోసి వేడి చేయండి. ఆపై ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు వేసి ఆనియన్స్​ గోల్డెన్ బ్రౌన్​ కలర్​ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి.
  • ఆపై గ్రైండ్​ చేసిన ధనియాలు-వెల్లుల్లి పేస్ట్​ వేసి కలపండి. అనంతరం పసుపు, ఉప్పు, కారం, అల్లం పేస్ట్ వేసి ఫ్రై చేయండి.
  • ఇప్పుడు చిక్కటి చింతపండు పులుసు పోసుకుని కలపండి.
  • పులుసులో నూనె పైకి తేలిన తర్వాత సరిపడా నీళ్లు యాడ్​ చేసి, రుచికి సరిపడా ఉప్పు వేయండి.
  • ఇప్పుడు గిన్నెపై మూత పెట్టి చింతపండు పులుసు బాగా మరిగించుకోండి.
  • వేడివేడి పులుసులో శుభ్రంగా కడిగిన బొమ్మిడాయిలు వేసుకోండి.
  • ఇప్పుడు గిన్నెపై మూత పెట్టి 10 నిమిషాలు ఉడికించుకోండి. ఈ బొమ్మిడాయిలు ఉడికిన తర్వాత గరిటెతో కలపకూడదు. ఎందుకంటే ముక్కలు విరిగిపోయే అవకాశం ఉంటుంది.
  • ఇప్పుడు పులుసులో కాస్త కొత్తిమీర తరుగు చల్లి స్టౌ ఆఫ్​ చేయండి.
  • అంతే ఇలా సింపుల్​గా చేసుకుంటే రుచికరమైన బొమ్మిడాయిల పులుసు మీ ముందుంటుంది!
  • వేడివేడి అన్నంతో ఈ పులుసు అద్దిరిపోతుంది.
  • ఈ బొమ్మిడాయిల పులుసు నచ్చితే మీరు ఓసారి ఇంట్లో ట్రై చేయండి.

గుంటూరు ఘాటుతో గోంగూర మటన్ - చూస్తేనే నోరూరిపోయేలా!

కేరళ స్టైల్​లో కోడిగుడ్డు కర్రీ - కొబ్బరి పాల గ్రేవీతో సూపర్ టేస్ట్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.