జీవో నెంబర్ 1పై ఎందుకీ వ్యతిరేకత.. అందరి ముందున్న మార్గమేంటి? - GO NUMBER 1 in andhra pradesh
🎬 Watch Now: Feature Video
GO NUMBER 1: రాష్ట్రంలో మరోసారి జీవో నంబర్ -1 వేడి రాజుకుంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం తెచ్చిన ఆ ఉత్తర్వుల్ని చీకటి జీవోగా, నిరంకుశ చర్యగా అభివర్ణిస్తున్న విపక్షాలు, ప్రజాసంఘాలు పోరుబాటను ఉద్ధృతం చేసేందుకు సిద్ధమయ్యాయి. ఆ దిశగా జీవో నంబర్ -1 వ్యతిరేక పోరాట కమిటీ ఏర్పాటు.. దాని కన్వీనర్‌గా ప్రముఖ న్యాయవాది, ఆంధ్రప్రదేశ్ పౌరహక్కుల సంఘం అధ్యక్షుడిగా ఉన్న ముప్పాళ్ల సుబ్బారావును ఎంపిక.. అంతలోనే ఆయనను పోలీసులు అరెస్టు చేయడం.. వంటి పరిణామాలన్నీ చాలా వేగంగా జరిగిపోయాయి. మరిప్పుడు ప్రతిపక్షాలు, ప్రజాసంఘాల కార్యాచరణ ఎలా ఉండబోతోంది? వారంతా జీవో నంబరు -1ను ప్రజాస్వామ్యంపై వేలాడే కత్తిగా.. ఎందుకు వాపోతున్నారు? భావప్రకటన స్వేచ్ఛపై జీవో నెంబర్-1 ప్రభావం ఎలా ఉంటుంది? వైఎస్సార్సీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నాటి అధికార పక్షం ఇలానే వ్యవహరిస్తే.. జగన్ ఇక్కడి వరకు వచ్చేవారా? కొంతకాలంగా విపక్షాలన్నీ సంధిస్తున్న సూటి ప్రశ్న ఇదే.. జీవోనెంబర్-1 లాంటి నిర్ణయాలపై రాష్ట్రంలో మేధావులు, విద్యావంతులు అందరి ముందున్న మార్గం ఏమిటి? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.