Prathidhwani: దసరా నాటికి ఇస్తానన్న డీఏ ఏమైంది..? పండగపూట కూడా మాటల గారడేనా..! - pending da arrears to Employees in AP
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Oct 20, 2023, 9:27 PM IST
Prathidhwani: రాష్ట్రంలో తమకు రావాల్సిన పాత – కొత్త బకాయిల సాధనకు మరోసారి ఉద్యమ కార్యచరణకు సిద్ధం అవుతున్నాయి ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు. అసలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి వారికి రావాల్సిన బకాయిలు ఎంత. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో పోల్చినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులు ఇలా డీఏల కోసం, పింఛన్ల కోసం, బకాయిల కోసం అడుక్కోవాల్సిన, ఆందోళనలు చేయాల్సిన పరిస్థితులు ఎందుకు. ఏ నెలకానెల 10వ తేదీ, 20వ తేదీ వరకు కూడా వేతనాలు, పింఛన్లకు తిప్పలు పెడుతున్న ప్రభుత్వం.. వారి ఆర్థిక ఇబ్బందుల్ని ఎందుకు పట్టించుకోలేక పోతోంది. ఉపాధ్యాయులు, ఉద్యోగులు, ప్రభుత్వ పింఛనుదారులకు రావాల్సిన డీఏ, డీఆర్, ఇంకా వేతన సవరణల పాత - కొత్త బకాయిలు ఎంత. దీనిపై ప్రభుత్వం ఏం చెబుతోంది. ఏపీఎన్జీవో రాష్ట్ర కౌన్సిల్ సమావేశంలో దసరాకల్లా 2022 జూలై డీఏ ఇస్తామని సీఎం స్వయంగా ప్రకటించారు. ఆ హామీ ఏమైంది. చివరకు పండగపూట కూడా ఎందుకు ఇదే పరిస్థితి. ఇదే అంశం నేటి ప్రతిధ్వని.