prathidhwani: మన సీఎం విశ్వసనీయతకు బ్రాండ్ అంబాసిడర్‌..! - prathidwani on jagan policeyes

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : May 4, 2023, 10:18 PM IST

Updated : May 5, 2023, 6:28 AM IST

 ముఖ్యమంత్రి మాటలకు అర్థాలే వేరులే.. రా‌ష్ట్రంలో చర్చ జరుగుతున్న విషయం ఇది. కొద్ది రోజులుగా రాష్ట్రంలో ఏ సభకు వెళ్లినా.. అక్కడ పదేపదే సీఎం జగన్ చెబుతున్న మాటలే అందుకు కారణం. నాకు మీడియా లేదంటూ మొదలు పెట్టి... తననో పేదల పక్షపాతిగా, ఇచ్చిన హామీలన్నీ అమలు చేసిన మేలిమి పాలకుడిగా కీర్తించుకోవడం సహా ఎన్నో విషయాలు ప్రస్తావిస్తున్నారు సీఎం. మరి వాటిల్లో నిజానిజాలు ఎంత?  వైసీపీ ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన హామీలు 98శాతం పైగా అమలు చేశామని అంటున్నారు.  లక్షల కోట్ల రూపాయలు ఇలా   మహిళలకు మేలు చేస్తుంటే తనకు అందరు అడ్డుకుంటున్నారని సీఎం చేసిన వ్యాఖ్యలను ఎలా అర్థం చేసుకోవాలి?  వివేకా హత్య, అమరావతిలో నివాసం,  మద్యనిషేధం, సీపీఎస్‌ రద్దు, ఇలా చెప్పుకుంటే ఎన్నో విషయాల్లో మడమ తిప్పేసిన సీఎం జగన్‌ ఇంకా తనను విశ్వసనీయతకు బ్రాండ్ అంబాసిడర్‌గా అభివర్ణించుకోవడం వెనక ఉద్ధేశం ఏమిటి?  ప్రజలు, విపక్షాలు, రాజకీయ విశ్లేషకులు ముఖ్యమంత్రి వ్యాఖ్యలను ఎలా చూస్తున్నారు? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని. 

Last Updated : May 5, 2023, 6:28 AM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.