నూతన పెన్షన్ విధానం వద్దు - ఓపీఎస్ అమలు చేయాలి : రైల్వే ఉద్యోగులు
🎬 Watch Now: Feature Video
Employees Relay Hunger Strike to Cancel the New Pension System : నూతన పెన్షన్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయీస్ సంఘం ఆధ్వర్యంలో రైల్వే ఉద్యోగులు నిరసన బాట పట్టారు. విజయవాడ డివిజనల్ రైల్వే మేనేజర్ కార్యాలయం ఎదుట ఉద్యోగులు రిలే నిరాహార దీక్షకు దిగారు. దేశ వ్యాప్తంగా పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ జనవరి 8న నుంచి 11న వరకు నిరాహార దీక్షలు చేపట్టామని ఎంప్లాయీస్ సంఘ నాయకులు తెలిపారు.
Railway Employees Strike : కొత్త పెన్షన్ విధానం వల్ల జీవితకాలం ఉద్యోగం చేసి పదవి విరమణ అనంతరం ఎటువంటి భద్రత లేకుండా జీవించాల్సిన దుస్థితి వస్తుందని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొత్త పెన్షన్ విధానం వల్ల ప్రభుత్వ ఉద్యోగులు నష్టపోతున్నారని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. లేదంటే తమ ఆందోళనలను ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.