పేద ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న వైసీపీ ప్రభుత్వం : ఏలూరి సాంబశివరావు

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 20, 2023, 12:32 PM IST

Eluri Says Liquor Prices Increased in YCP Government: ముఖ్యమంత్రి జగన్ మద్యం నిషేధంపై ఇచ్చిన హామీ నెరవేర్చకపోగా మరోసారి మద్యం ధరలు పెంచి పేదలను దగా చేస్తున్నారని బాపట్ల జిల్లా పర్చూరు టీడీపీ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు మండిపడ్డారు. జగన్ సర్కారు అధికారంలోకి వచ్చిన తరువాత మద్యం నిషేధిస్తానని చెప్పి ప్రభుత్వం ద్వారానే మద్యం అమ్మకాలు జరుపుతుందని విమర్శించారు. బాపట్ల జిల్లా ఇంకొల్లు బండకాలనీలో మన పల్లెకు మన ఏలూరి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ పాదయాత్రలో పాల్గొన్న ఎమ్మెల్యే ఏలూరి, టీడీపీ నాయకులు, కార్యకర్తలకు ప్రజలు ఘనస్వాగతం పలికారు.

Mana Palleku Mana Eluri Program in Bapatla:గ్రామంలో భారీ పాదయాత్రగా ఏలూరి ఇంటింటికి  తిరుగుతూ వైసీపీ చేసిన మోసాలను ప్రజలకు వివరించారు. బాబు ష్యూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ కరపత్రాలను అందచేశారు. ఈ సందర్భంగా ఏలూరి మాట్లాడుతూ తెలియని బ్రాండ్ల పేరుతో కల్తీ మద్యం తయారు చేసి అమ్ముతూ ప్రజల ప్రాణాలతో జగన్ ప్రభుత్వం చెలగాటం ఆడుతుందని మండిపడ్డారు. మద్యం అమ్మకం ద్వారా వచ్చిన సొమ్ము నేరుగా ముఖ్యమంత్రి ఇంటికి వెళుతుందన్నారు. వెనుకబడిన కులాల అభ్యున్నతికి టీడీపీ కట్టుబడి ఉంటుందన్నారు. వైసీపీ ప్రభుత్వం బీసీ, ఎస్సీ, ఎస్టీలకు అందాల్సిన పలు పథకాలను రద్దు చేసిందని ఆరోపించారు. నిత్యావసర వస్తువులు, బస్సు, విద్యుత్ చార్జీలు, ఇసుక ధరలు పెంచి పేద, మధ్యతరగతి ప్రజలను వైసీపీ ప్రభుత్వం దోచుకుంటుందని విమర్శించారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.