Duduma Waterfalls: స్వర్గాన్ని తలపిస్తున్న డుడుమ జలపాతం.. ఆ అందాలు చూసేయండి - Waterfalls in AP
🎬 Watch Now: Feature Video
ఒకవైపు ఆంధ్ర.. మరోవైపు ఒడిశా.. వీటి రెండిట నడుమ డుడుమ జలపాతం ఉంది. ఈ జలపాతానికి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు ఉంది. బోండా గిరిజన మహిళలను చూడటానికి వచ్చే విదేశీ పర్యాటకులు సైతం డుడుమ జలపాతం దగ్గర సేద తీరుతారు. ఇప్పుడు ఈ జలపాతం వరద ఉధృతి పర్యాటకులను అమితంగా ఆకట్టుకుంటోంది. మాచ్‌ఖండ్ జల విద్యుత్ కేంద్రం దిగువున గల బలిమెల జలాశయంలో నీటి మట్టాలు కిందకు జారడంతో.. ముందస్తు చర్యలుగా ఒడిశా వారు జెన్‌కో వర్గాలకు అదనపు నీటి విడుదలకు కోరారు.. దీంతో గత రెండు రోజులుగా డుడుమ జలాశయం నుంచి రెండు గేట్లు ఎత్తి 16 వందల క్యూసెక్కుల వరద నీటిని బలిమెలకు విడుదల చేస్తున్నారు. డుడుమ జలాశయం నుంచి 5, 6 గేట్ల ద్వారా నీటి విడుదల చేస్తున్నారు.
550 అడుగల ఎత్తు నుంచి వడివడిగా బలిమెలకు పరుగులు తీస్తున్న నీటి ప్రవాహాన్ని సందర్శకులు చూసి మంత్ర ముగ్దులు అవుతున్నారు. వేసవిలో కూడా ఈ జలధారను చూసేందుకు ప్రకృతి ప్రేమికులు డుడుమ జలపాతం వద్దకు పరుగులు తీస్తున్నారు. ఉన్నతాధికారుల అనుమతులు వచ్చేంత వరకు ఈ నీటి విడుదల కొనసాగుతుందని ప్రాజెక్టు వర్గాలు తెలిపాయి.