సెల్ టవర్ ఎక్కిన డీఎస్సీ-98 అభ్యర్థులు.. కౌన్సిలింగ్ ఆపాలని డిమాండ్ - viral videos in ap
🎬 Watch Now: Feature Video
DSC 98 CANDIDATES CLIMBED CELL TOWER: డీఎస్సీ-98 అభ్యర్థులకు రోస్టర్ పద్ధతికి బదులు.. ఆర్డర్ ఆఫ్ మెరిట్ ప్రకారం నియామకాలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ బ్యాచ్‌కు సంబంధించిన అభ్యర్థులు నిరసనలు తెలియజేస్తున్నారు. తాజాగా డీఎస్సీ-98 అభ్యర్థులకు నిర్వహించే కౌన్సిలింగ్‌ను వెంటనే ఆపాలని డిమాండ్ చేస్తూ.. గుంటూరు జిల్లా మంగళగిరిలో ఇద్దరు అభ్యర్థులు సెల్ టవర్ ఎక్కారు. ఉద్యోగాల భర్తీలో రోస్టర్ పద్ధతికి బదులు.. ఆర్డర్ ఆఫ్ మెరిట్ ప్రకారం నియామకాలు చేపట్టడంతో ఎస్సీ, బీసీ అభ్యర్థులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని వాపోయారు. పాదయాత్రలో అర్హులందరికీ ఉద్యోగాలు ఇస్తానని చెప్పిన జగన్.. ఇప్పుడు మాట మార్చి మడమ తిప్పి తమకు అన్యాయం చేశారని పులివెందులకు చెందిన రమేష్, నెల్లూరుకు చెందిన శ్రీనివాసులు ఆవేదన వ్యక్తం చేశారు.
డీఎస్సీ-98 అభ్యర్థులతో ఉపాధ్యాయ పోస్టుల భర్తీలో రోస్టర్ విధానాన్ని పాటించాలని పలువురు ఉద్యోగార్థులు డిమాండ్ చేస్తున్నారు. ఉద్యోగాల భర్తీలో రాష్ట్ర ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తోందని వారు ఆరోపించారు. ఆర్డర్ ఆఫ్ మెరిట్ ప్రకారం ఉద్యోగాలు ఇస్తే బీసీ, ఎస్సీ అభ్యర్థులు అన్యాయానికి గురవుతారని ఆవేదన వ్యక్తం చేశారు. గత ఎన్నికల్లో హామీ ఇచ్చిన మేరకు అభ్యర్థులందరికీ ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.