మత్స్యకారుల వలకు చిక్కిన డ్రోన్ - airforce officers missiles test in suryalanka
🎬 Watch Now: Feature Video


By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 9, 2023, 2:03 PM IST
Drone Caught Fisherman Net in Bapatla: బాపట్ల జిల్లా వేటపాలెం మండలం రామాపురం వద్ద సముద్రంలో చేపల వలకు డ్రోన్ (drone)చిక్కింది. పొట్టిసుబ్బయ్యపాలెం తీరంలో శనివారం చేపల వేటకు వెళ్లిన మత్స్యకారులకు ఈ డ్రోన్ దొరికింది. వెంటనే మత్సకారులు మెరైన్ పోలీసుల(Marine Police)కు డ్రోన్ గురించి సమాచారం ఇచ్చారు. మత్స్యకారుల సమాచారంతో పొట్టిసుబ్బయ్య పాలెం వచ్చిన మెరైన్ పోలీసులు డ్రోన్ పరిశీలించి సూర్యలంక ఎయిర్‌ఫోర్సు అధికారులకు సమాచారం ఇచ్చారు. అక్కడికి చేరుకున్న ఎయిర్‌ఫోర్సు అధికారులు డ్రోన్‌ను పరిశీలించి అది తమదేనంటూ తీసుకెళ్లారు.
Missiles testing Held in Suryalanka coast: మెరైన్ ఏఎస్ఐ(Assistant Sub inspector) ఆలీఖాన్ తెలిపిన వివరాల ప్రకారం బాపట్ల జిల్లా సూర్యలంక తీరంలో క్షిపణుల (missiles) ప్రయోగం జరుగుతోంది. దీనిలో భాగంగా డ్రోన్‌ను ఎయిర్‌ఫోర్సు అధికారులు ప్రయోగించారు. కొద్దిసేపటికే ఆ డ్రోన్ సముద్రంలో పడిపోవడంతో మత్స్యకారుల వలకు చిక్కిందని ఏఎస్ఐ (A.S.I) తెలిపారు. సూర్యలంక ఎయిర్‌ఫోర్సు అధికారులకు సమాచారం ఇవ్వడంతో వారు డ్రోన్‌ను స్వాధీనం చేసుకున్నారని తెలిపారు.