Doubt Clearance Bot for AP Govt School Students: ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు 'డౌట్ క్లియరెన్స్ బాట్'.. విద్యాశాఖ ఉత్తర్వులు - Doubt Clearance Bot
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Oct 19, 2023, 12:45 PM IST
Doubt Clearance Bot for AP Govt School Students: ఏపీలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సందేహాలను నివృత్తి చేసేందుకు చాట్‌బాట్ (Chatbot) పేరిట ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (Artificial intelligence) పరిజ్ఞానం అందుబాటులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పాఠశాలల డిజిటలైజేషన్ ప్రక్రియలో భాగంగా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా చాట్‌బాట్ అందుబాటులోకి తెచ్చేలా పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. మొబైల్ యాప్ ద్వారా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ చాట్‌బాట్ పని చేస్తుందని ప్రభుత్వం తెలిపింది.
ఈ మేరకు కాన్వే జీనియస్ (ConveGenius) ఏఐ సొల్యూషన్స్ సంస్థతో ఒప్పందం కుదిరిందని పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ (AP Education Principal Secretary Praveen Prakash) పేర్కొన్నారు. విద్యార్థులకు పంపిణీ చేసిన ట్యాబ్‌లు, పాఠశాలలలో స్మార్ట్ బోర్డుల ద్వారా ఏఐ సందేహ నివృత్తి చాట్‌బాట్ అందుబాటులోకి వస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. తరగతి వేళలు ముగిసిన అనంతరం ఈ చాట్‌బాట్ ద్వారా విద్యార్థులు సందేహాలు నివృత్తి చేసుకోవచ్చని స్పష్టం చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది.
TAGGED:
Doubt Clearance App