Document Writers Pen Down in AP: నూతన రిజిస్ట్రేషన్ విధానానికి వ్యతిరేకంగా డాక్యుమెంట్ రైటర్ల పెన్ డౌన్.. - Card Prime 2
🎬 Watch Now: Feature Video


By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 29, 2023, 4:07 PM IST
Document Writers Pen Down in AP: రిజిస్ట్రేషన్ వ్యవస్థలో ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రైమ్‌కార్డు 2.0 (Card Prime 2.0) వ్యవస్థను రద్దు చేయాలంటూ విజయవాడలో దస్తావేజు లేఖరులు పెన్ డౌన్ కార్యక్రమం నిర్వహించారు. రిజిస్ట్రేషన్ కార్యాలయం ఎదుట దస్తావేజు లేఖరులు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. ప్రైమ్‌కార్డు 2.0 విధానానికి సంబంధించిన అవగాహన కార్యక్రమాలు సైతం ఏర్పాటు చేయలేదని తెలుపుతున్నారు. గతంలో సులభతరంగా ఉన్న వ్యవస్థ.. ప్రస్తుత విధానం (New Registration Procedure) కారణంగా కష్టంగా మారిందని వాపోతున్నారు. అదే విధంగా ప్రస్తుతం తీసుకొచ్చిన వ్యవస్థలో చాలా లోపాలు ఉన్నాయని డాక్యుమెంటు రైటర్లు అంటున్నారు. ఒక్కో రిజిస్ట్రేషన్‌కు చాలా ఎక్కువ టైం పడుతుందని అన్నారు. రిజిస్ట్రేషన్ చేపించుకున్న వ్యక్తుల ఆస్తులకు కూడా భద్రత లేదని అంటున్నారు. కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాలో ప్రభుత్వం చేపట్టిన ఫైలెట్ ప్రాజెక్టులో అనే సమస్యలు తలెత్తుతున్నాయంటున్నారు. దీనిపై డాక్యుమెంట్ రైటర్స్ నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాసమోహన్ అందిస్తారు.