Deputy CM Narayanaswamy Interesting Comments on YCP: 'వైసీపీ రెడ్ల పార్టీ': ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి - tdp news
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Oct 21, 2023, 7:28 PM IST
Deputy CM Narayanaswamy Interesting Comments on YCP: పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వైఎస్సార్సీపీ రెడ్ల పార్టీ అని అన్నారు. తాను రెడ్లను తిడుతున్నానంటూ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి ఫిర్యాదు చేశారని మండిపడ్డారు.
Narayanaswamy Comments: తిరుపతిలో నిర్వహించిన పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవంలో ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి పాల్గొన్నారు. అనంతరం అమరులకు నివాళులు అర్పించిన నారాయణస్వామి.. పలువురు అధికారులకు అవార్డులు అందజేశారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి మీడియాతో మాట్లాడుతూ..''వైఎస్సార్సీపీ రెడ్ల పార్టీ. ఎవరీని తిట్టాల్సిన ఖర్మ నాకు లేదు. నేను రెడ్లను తిడుతున్నానని కొంత మంది ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. రెడ్ల పార్టీలోనే ఉంటూ రెడ్లను ఎందుకు తిడతాను చెప్పండి. మా అధినేత జగన్ మోహన్ రెడ్డిని విమర్శించే రెడ్లను మాత్రమే నేను తిడుతున్నాను.'' అని ఆయన అన్నారు.