అంగన్​వాడీ కార్యకర్తల డిమాండ్లను వెంటనే నెరవేర్చాలి : సీపీఐ కార్యదర్శి రామకృష్ణ - ఏపీ తాజా వార్తలు

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 27, 2023, 5:50 PM IST

Demand to Solve Anganwadi Problems : సమస్యల పరిష్కరించాలని ఆందోళన చేస్తున్న అంగన్​వాడీ కార్యకర్తలను ప్రభుత్వం పట్టించుకోకపోవడం దుర్మార్గమని సీపీఐ కార్యదర్శి రామకృష్ణ మండిపడ్డారు. శాంతియుతంగా నిరసనలు చేస్తున్న అంగన్​వాడీలను అరెస్ట్​ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. తక్షణమే ముఖ్యమంత్రి జగన్​ మోహన్​ రెడ్డి అంగన్​వాడీ కార్యకర్తలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్​ చేశారు.

CPI Secretary Condemned the Arrest of Anganwadi Workers : రాష్ట్రంలో అంగన్​వాడీ కార్యకర్తలు సమ్మె చేస్తున్న ప్రభుత్వం వారి డిమాండ్​లను పరిష్కరించకుండా దాట వేస్తుందని రామకృష్ణ మండిపడ్డారు. ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు పక్క రాష్ట్రంలో కన్నా అదనంగా వేతనాలు చెల్లింస్తామని చెప్పి అధికారంలోకి రాగానే అంగన్​ వాడీ కార్యకర్తలను సీఎం జగన్​ మోసం చేశాడని ధ్వజమెత్తారు. ఇప్పటికైనా వారి డిమాండ్లను పరిష్కరించాలని కోరుతున్నారు. లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా సమ్మెను మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. అంగన్​వాడీ కార్యకర్తల డిమాండ్​లను నెరవేర్చకుండా ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం నిర్వహించడం ఏంటి అని ప్రశ్నించారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.