Daggubati Purandeswari on New TTD Board టీటీడీ బోర్డు రాజకీయ పునరావాస కేంద్రమని మళ్లీ నిరూపించారు: పురందేశ్వరి - బీజేపీ అధికార ప్రతినిధి లంకా దినకర్
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Aug 26, 2023, 1:10 PM IST
Daggubati Purandeswari on TTD Board Members Appointments: తిరుమల తిరుపతి పవిత్రతను మసక పరిచేలా బోర్డు సభ్యుల నియమాకాలున్నాయని భారతీయ జనతా పార్టీ ఆరోపించింది. టీటీడీ పాలక మండలి నియామకాలపై ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. టీటీడీ బోర్డు.. రాజకీయ పునరావాస కేంద్రమని మళ్లీ నిరూపించారని విమర్శించారు. బోర్డు సభ్యులుగా శరత్ చంద్రారెడ్డి, కేతన్ దేశాయ్ నియామకమే ఇందుకు నిదర్శనం అన్నారు. దిల్లీ లిక్కర్ స్కామ్‌లో శరత్ చంద్రారెడ్డి పాత్రధారిగా ఉన్నారని ఆమె ఆరోపించారు. ఎంసీఐ స్కామ్‌లో దోషిగా తేలి కేతన్ దేశాయ్ పదవి కోల్పోయారన్నారు. తిరుమల పవిత్రతకు మచ్చ తెచ్చే ఈ విధానాన్ని బీజేపీ ఖండిస్తోందని పురందేశ్వరి తెలిపారు.
BJP Leader Lanka Dinakar over Appointment of TTD Board Members: టీటీడీ పాలక మండలి సభ్యుల నియామకాల్లో సామాజిక సమతుల్యత దెబ్బతిందని బీజేపీ అధికార ప్రతినిధి లంకా దినకర్ ఆరోపించారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి తిరుమల శ్రీవారి సేవ కన్నా.. తన సొంత వారి సేవ ఎక్కువైందని దుయ్యబట్టారు. తిరుమల తిరుపతి దేవస్థానం ప్రాశస్త్యాన్ని దెబ్బ తీయడం రాష్ట్ర ప్రభుత్వానికి నిత్యకృత్యం అయిందని ధ్వజమెత్తారు. లిక్కర్ స్కామ్‌లో నిందితుడు అయిన శరత్ చంద్రారెడ్డికి, ఆరోపణలు ఎదుర్కొంటున్న కళంకితులకు పదవులను కట్టబెట్టారని ఆరోపించారు.