CPM Praja Rakshana Buss Yatra In Vijayawada : ఓట్ల కోసమేనా కులగణన ప్రకటన?.. సమస్యలపై 'ప్రజా రక్షణ భేరి': సీపీఎం - vijayawada latest news
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Oct 19, 2023, 4:30 PM IST
CPM Praja Rakshana Buss Yatra In Vijayawada : ప్రజా రక్షణ భేరి పేరిట నవంబర్ 15 నుంచి బస్ యాత్ర చేపడుతున్నట్లు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు వెల్లడించారు. ఈ మేరకు ప్రజా ప్రణాళిక భేరికి సంబంధించిన బ్రోచర్‌ను విడుదల చేశారు. రాష్ట్రంలో ప్రజల సమస్యల పరిష్కారానికి సదస్సులు నిర్వహిస్తామన్నారు. రాష్ట్రంలో తీవ్ర నీటి ఎద్దడితో పంటలు ఎండిపోయి రైతులు నష్టపోతున్నారని తెలిపారు. మంచినీటి కొరత, విద్యుత్ కోతలు, జ్వరాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆయన పేర్కొన్నారు. ఇప్పటి వరకు ప్రభుత్వం రైతుల పంట నష్టంపై నివేదిక కూడా ఇవ్వలేదని విమర్శించారు.
CPM State Secratery Fire On YCP : ప్రభుత్వం కులగణన చేపడతాం అని చెప్పడం అసంబద్ధంగా ఉందని శ్రీనివాస రావు అన్నారు. దేశవ్యాప్తంగా జరగాల్సిన దాన్ని తేలికైన విషయంలా చేయడం సరి కాదని సూచించారు. కేవలం ఓట్ల కోసం కులగణన చేపడతాం అని చెప్పడం సరి కాదని మండిపడ్డారు. దసరాకు రేషన్‌తో బెల్లం ఇతర సరుకులు ఇవ్వాలని కోరారు. విశ్వ హిందు పరిషత్ వారు టీటీడీ నిధులపై వివాదాలు సృష్టించడం మంచిది కాదని పేర్కొన్నారు.