సీఎం వస్తున్నాడని సీపీఎం నాయకుల గృహ నిర్భంధం - 'హక్కులను కాలరాస్తున్న ప్రభుత్వం' - ముఖ్యమంత్రి పర్యటన
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 21, 2023, 3:48 PM IST
CPM Leaders House arrest Due to CM Tour in Alluri District : అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లిలో ముఖ్యమంత్రి పర్యటనను అడ్డగిస్తారని కారణంతో గిరిజన సంఘ సీపీఎం నాయకులను పోలీసులు ముందస్తుగా గృహనిర్బంధం చేశారు. రాష్ట్ర గిరిజన సంఘ అధ్యక్షుడు, సీపీఎం పార్టీ జిల్లా అధ్యక్షుడు అప్పలనరసను తెల్లవారుజాము నుంచి పాడేరులో ఇంట్లో నుంచి బయటకు రానివ్వకుండా పోలీసులు కాపలా ఉన్నారు. గిరిజన, రాజ్యాంగ హక్కులను కాలరాస్తూ ప్రభుత్వ పరిపాలన ఉందని తమను నిర్బంధించడం తగదని వారు ప్రశ్నించారు. గిరిజన సమస్యలపై ప్రశ్నిస్తామనే నేపథ్యంలో ముందస్తుగా నిర్బంధించారన్నారని మండిపడ్డారు.
ఉమ్మడి విశాఖ జిల్లా జడ్పీటిసీ సభ్యుడు గంగరాజును అనంతగిరిలో పోలీసులు గృహ నిర్భంధంలో ఉంచారు. ఈ క్రమంలో వారు ప్రభుత్వ వైఖరిపై మండిపడ్డారు. ఏజెన్సీలో చట్టాలను ఉల్లంఘించి దొడ్డి దారిన ప్రైవేటు కంపెనీలకు ప్రజల సొమ్ము ధారా దత్తం చేస్తున్నారని ఆరోపించారు. అంగన్వాడీలకు జీతాల పెంచుతామని గద్దెనెక్కిన ముఖ్యమంత్రి ప్రస్తుతం వారి పట్ల నిర్లక్ష్యం చూపుతున్నారని, అది తగదని వారి సమస్యలు పరిష్కరించాలని సీపీఎం నాయకుడు, జడ్పీటీసీ సభ్యుడు గంగరాజు డిమాండ్ చేశారు.