ఎన్నికలు ఎప్పుడు వచ్చినా వైసీపీ ఓటమి ఖాయం - మంత్రులకూ దొరకని సీఎం అపాయింట్మెంట్ : సీపీఐ - AP Latest News
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 15, 2023, 5:25 PM IST
CPI State Secretary Ramakrishna Criticized CM Jagan : జగన్ మోహన్ రెడ్డి ఓటమి భయంతోనే 82 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలను మారుస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విమర్శించారు. విశాఖ సీపీఐ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో నిర్వహించారు. సీఎం తాడేపల్లి ప్యాలెస్ కట్టుకుని కనీసం మంత్రులు, ఎమ్మెల్యేలకు కూడా కలిసే అవకాశం ఇవ్వడం లేదని తెలిపారు. అలాంటి ముఖ్యమంత్రి ఇప్పుడు సిట్టింగులను మారుస్తానంటే ఎమ్మెల్యేలు అందరూ కలిసి నిలదీయాలన్నారు.
రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైసీపీ ఓటమి ఖాయమని తెలిపారు. వైసీపీ ఓటమికి రాష్ట్ర ప్రజానీకం అంతా సన్నద్ధమై ఉన్నారని వివరించారు. తెలంగాణలో కేసీఆర్ నియంతృత్వ పోకడకు వ్యతిరేకంగానే ఆయనను ఆ రాష్ట్ర ప్రజానీకం ఇంటికి పంపారని తెలిపారు. త్వరలో భువనేశ్వర్లో జరిగే ఇండియా కూటమి సమావేశంలో సీపీఐ కేంద్రనాయకత్వం తీసుకునే నిర్ణయాలకు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారత కమ్యూనిస్టు పార్టీ పొత్తులు ఉంటాయని రామకృష్ణ స్పష్టం చేశారు.