CPI Secretary Rama Krishna Fire on Jagan: జగన్ అధికారం చేపట్టాక.. ప్రతిపక్షాలపై దాడులు నిత్యకృత్యమయ్యాయి: రామకృష్ణ - cpi secretary Rama Krishna fire on Jagan
🎬 Watch Now: Feature Video
CPI Secretary RK reaction On Angallu Attack: ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని అంగళ్లు, పుంగనూరులో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన నేపథ్యంలో కాంగ్రెస్ శ్రేణులు రాళ్ల దాడి చేయడాన్ని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తీవ్రంగా ఖండించారు. ఈ దాడి ఘటనకు పాల్పడ్డ వారిని తక్షణమే గుర్తించి.. అరెస్టు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. చంద్రబాబు వస్తున్న మార్గంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు భారీ వాహనాలను అడ్డుపెట్టి పర్యటనను అడ్డుకోవాలని చూడటం.. దీనికి పోలీసులు సహకరించడం వారి విపరీత చర్యలకు తార్కాణం అని ఆయన మండిపడ్డారు. దాడికి పాల్పడిన దుండగులను విడిచిపెట్టి.. టీడీపీ శ్రేణులపై లాఠీఛార్జ్ చేయడం, బాష్పవాయువు ప్రయోగించడం వంటి దుందుడుకు చర్యలకు పోలీసులు పాల్పడటాన్ని రామకృష్ణ తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ వ్యవస్థలో ధర్నాలు, సమావేశాలు, సభలు నిర్వహించుకోవడం సర్వ సాధారణం అని గతంలో జగన్ కూడా పాదయాత్ర చేశారని ఆయన గుర్తు చేశారు. జగన్ అధికారం చేపట్టాక రాష్ట్రంలోప్రతిపక్షాలపై దాడులు, వేధింపులు నిత్యకృత్యమైపోయాయని రామకృష్ణ మండిపడ్డారు.