CPI Ramakrishna Sensational Comments on CBN Arrest: చంద్రబాబు అరెస్టుకు వైసీపీ, బీజేపీ కుమ్మక్కు.. ప్రజా వ్యతిరేకతతో బుకాయింపు: రామకృష్ణ - CPI Ramakrishna
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/13-10-2023/640-480-19756930-thumbnail-16x9-cpi-ramakrishna-sensational-comments-on-cbn-arrest.jpg)
![ETV Bharat Andhra Pradesh Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/andhrapradesh-1716535904.jpeg)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Oct 13, 2023, 3:09 PM IST
CPI Ramakrishna Sensational Comments on CBN Arrest: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడును అక్రమంగా అరెస్టు చేసి, ప్రస్తుతం ప్రజా వ్యతిరేకత చూసి వైసీపీ, బీజేపీ మాకు సంబంధం లేదంటే.. మాకు సంబంధం లేదని నాటకాలు ఆడుతున్నాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు సదస్సులో పాల్గొనడానికి కల్యాణదుర్గం వచ్చిన రామకృష్ణ.. విలేకరులతో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు అరెస్టుపై స్పందించారు. ముఖ్యమంత్రి ఓ బహిరంగ సభలో మాట్లాడుతూ తాను లండన్‌లో ఉన్న సమయంలో అరెస్టు చేశారని, ఆ విషయం తనకు తెలియదని చెప్పారన్నారు.
అదేవిధంగా లోకేశ్‌తో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షా మాట్లాడుతూ.. తనకు విషయం తెలియదని మాట్లాడటం చూస్తుంటే నాటకాలు ఆడుతున్నారని స్పష్టంగా సామాన్యులకు అర్థం అవుతోందని రామకృష్ణ పేర్కొన్నారు. కనీస రాజకీయ పరిజ్ఞానం ఉన్న ఏ ఒక్కరూ వారిద్దరి మాటలు నమ్మటం లేదన్నారు. అబద్దాలు కాకుండా.. దమ్ముంటే ఇరు పార్టీల నాయకులు వాస్తవాలు మాట్లాడాలని అన్నారు. 20 రోజులపాటు లోకేశ్ ఢిల్లీలో ఉంటే కలిసి మాట్లాడలేదని, పక్క రాష్ట్రంలో కిషన్ రెడ్డి అడిగితే అమిత్ షా కలిసి మాట్లాడటం తెలంగాణలో రాజకీయంగా లబ్ధి పొందడానికే అంటూ రామకృష్ణ వివరించారు. పక్కా ప్లాన్ ప్రకారం చంద్రబాబు నాయుడును రాజకీయంగా ఇబ్బంది కలిగించాలని అక్రమ అరెస్టు చేశారని, లేకుంటే నోటీసు కూడా ఇవ్వకుండా ఎందుకు అరెస్టు చేశారు.. ఇది కుట్ర కాదా.. అంటూ ఆయన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను నిలదీశారు.