కరవు గురించి చర్చించని మంత్రివర్గం ఈ రాష్ట్రానికి అవసరమా?: సీపీఐ - Farmers are suffering due to lack of water in AP

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 4, 2023, 5:50 PM IST

CPI Ramakrishna on YCP Government Over Drought Issue: రాష్ట్రంలో నెలకొన్న కరువు పరిస్థితులపై వైసీపీ ప్రభుత్వం క్యాబినెట్ మీటింగ్​లో చర్చించక పోవడం దురదృష్టకరమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మండిపడ్డారు. ప్రస్తుతం కరువు సమస్య కంటే ఇంకే పెద్ద సమస్య లేదన్నారు. కరువు పరిస్థితుల గురించి చర్చించని మంత్రి వర్గం ఈ రాష్ట్రానికి అవసరమా అని నిలదీశారు. రాష్ట్రంలో 400 పైచిలుకు మండలాల్లో తీవ్ర దుర్భిక్ష పరిస్థితులు ఉంటే.. ప్రభుత్వం 103 మండలాలతో సరిపెట్టిందని విమర్శించారు. నేడు రాష్ట్రంలో గ్రామాలకు గ్రామాలు ఖాళీ చేసి వలసలు వెళ్తుంటే జగన్ ప్రభుత్వం నిద్రపోతోందన్నారు. రైతుల పరిస్థితి దయనీయంగా ఉంటే ముఖ్యమంత్రి, మంత్రులు చోద్యం చూస్తున్నారని ప్రశ్నించారు. జగన్ ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని నిర్లక్ష్యం చేయటం దుర్మార్గమని ఆరోపించారు. తక్షణమే కేంద్రం స్పందించి కరవు సమస్యను జాతీయ సమస్యగా గుర్తించాలని కోరారు. కృష్ణానది జలాల పంపిణిపై కేంద్రం తెచ్చిన చట్టంతో రాయలసీమకు తీరని అన్యాయం జరుగుతుందని అన్నారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.