CPI Ramakrishna On CM Jagan Gautam Adani Meeting సీఎం జగన్‌, అదానీ రహస్య సమావేశం ఆంతర్యమేంటో చెప్పాలి: సీపీఐ రామకృష్ణ - reasons for cm jagan and adani meet

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 29, 2023, 5:21 PM IST

CPI Ramakrishna On CM Jagan Gautam Adani Meet: ముఖ్యమంత్రి జగన్‌, వ్యాపారవేత్త అదానీ రహస్య సమావేశం ఆంతర్యమేంటో చెప్పాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు. పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొనేందుకు కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గంలోని ఉయ్యూరు విచ్చేసిన సీపీఐ పార్టీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ పార్టీ నేతలతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. రాష్ట్ర సంపదను అదానీకి దోచిపెట్టేందుకు జగన్ పనిచేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్మించాల్సిన గంగవరం పోర్ట్ అదానీకి ఎందుకు కట్టబెట్టారని ప్రశ్నించారు. సంపదను అదానీకి దోచిపెట్టడం వలన రాష్ట్రంలో ధరలు విపరీతంగా పెరిగి ప్రజలు ఇబ్బంది పడతారని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు అరెస్టు వెనక బీజేపీ పెద్దల హస్తముందని అనుమానం వ్యక్తం చేశారు. జగన్‌ను ఇంటికి పంపేందుకు అవసరమైతే తెలుగుదేశంతో కలిసి పనిచేస్తామని రామకృష్ణ చెప్పారు. చంద్రబాబు నాయుడు అరెస్టును ఖండిస్తూ ఉద్యమానికి సంఘీభావం తెలియజేస్తున్నామని తెలిపారు. జగన్ సీఐడీని జేబు సంస్థగా వాడుకుంటున్నారన్నారు. రానున్న ఎన్నికల్లో జగన్​కు ప్రజలు బుద్ధి చెప్పే సమయం ఆసన్నమైందని ఆయన హెచ్చరించారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.