తెలంగాణలో కోరుకున్నట్లే ఏపీలో మార్పు తప్పదు: సీపీఐ నారాయణ - CM Jagan on CPI National Secretary Narayana
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 12, 2023, 3:57 PM IST
CPI Narayan allegations against CM Jagan: మిగ్జాం తుపాను బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ డిమాండ్ చేశారు. తిరుపతిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మిగ్జాం తుపాను (Michaung Cyclone) బాధితులతో మాట్లాడకుండా హెలికాప్టర్లో తిరిగే ముఖ్యమంత్రి దేశంలో ఎవరైనా ఉన్నారంటే అది ఒక్క జగన్మోహన్ రెడ్డి మాత్రమేనని విమర్శించారు. ముఖ్యమంత్రి పర్యటన కోసం మనుషులను నిర్భందించటం, చెట్లు కొట్టేయటం పాపమన్నారు. రాష్ట్రాభివృద్ది కోసం అఖిలపక్షంతో కలిసి కేంద్రంపై ఒత్తిడి తీసుకవచ్చి, రాష్ట్ర ప్రజలను కాపాడుకోవాల్సిన బాధ్యత సీఎంపై ఉందన్నారు.
ఎమ్మెల్యే అభ్యర్థులను మార్చినంత మాత్రాన ఏమీ జరగదని, జగన్‌పైన ప్రజల్లో వ్యతిరేకత ఉందన్నారు. తనపై ఉన్న వ్యతిరేకతను ఎమ్మెల్యేలపై రుద్దేందుకు జగన్ ప్రయత్నిస్తున్నాడని నారాయణ విమర్శించారు. వైసీపీలో సీఎం అభ్యర్థిగా జగన్‌ను మారిస్తే పరిస్థితి కొంతైనా మారవచ్చన్నారు. తెలంగాణలో మార్పు కోరుకున్నట్లే ఆంధ్రప్రదేశ్‌లోనూ మార్పు తప్పదన్నారు. జగన్ పాలనలో అహంకారం, నియంతృత్వం, అవినీతి పెరిగి పోయిందని నారాయణ ఆరోపించారు.