'రాష్ట్ర కరువు పరిస్థితులు జగన్ రెడ్డికి పట్టవా?' - కరవు మండలాల ప్రకటన

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 16, 2023, 2:24 PM IST

CPI, AITUC Leaders Fire On CM Jagan In Prakasam District : రాష్ట్రంలో కరవు విలయ తాండవం చేస్తుంటే ముఖ్యమంత్రి జగన్మోహన్​రెడ్డి, మంత్రులు పట్టించుకోవడంలేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు గుజ్జుల ఈశ్వరయ్య అన్నారు. ప్రకాశం జిల్లా కనిగిరి  దర్శి చెంచయ్య భవన్ లో సీపీఐ రాష్ట్రకార్యదర్శివర్గ సభ్యులు, ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షులు మీడియా సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ... రాష్ట్రంలో 18జిల్లాల్లోని 440 మండలాల్లో వర్షాభావ పరిస్థితుల వల్ల పంటలు ఎండిపోయాయని, భూగర్భ జలాలు అడుగంటి తాగు, సాగు నీరులేక పల్లె ప్రజలు ఇబ్బందులు పడుతుంటే సీఎం జగన్ కరవుపై మాట్లాడేందుకు ఇష్టపడక పోవడం ఎవరి వద్ద మెప్పు పొందేందుకోనని ఆయన విమర్శించారు.
Drought  Areas Issue in AP 2023 : కర్ణాటకలో సిద్ధారామయ్య ప్రభుత్వం సెప్టెంబరు 26నే కరవు తాలూకాలను ప్రకటించి కేంద్ర బృందాలను పిలిపించి నివేదిక సమర్పించిందన్నారు. వైసీపీ ప్రభుత్వం మాత్రం 103 మండలాలను మాత్రమే ప్రకటించి చేతులు దులుపుకొందని మండిపడ్డారు. 
 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.