అందని 'తుపాను సాయం' - ప్రభుత్వ కార్యాలయాలను ముట్టడించిన బాధితులు - Demands to support the storm victims
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/15-12-2023/640-480-20276527-thumbnail-16x9-concerns-of-cyclone-victims-in-tirupati-district.jpg)
![ETV Bharat Andhra Pradesh Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/andhrapradesh-1716535904.jpeg)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 15, 2023, 7:10 PM IST
Concerns of Cyclone Victims in Tirupati District : ముఖ్యమంత్రి ప్రకటించిన తాత్కాలిక సాయం, నిత్యావసరాలు అందించాలంటూ తిరుపతి జిల్లాలో తుపాను బాధితులు ఆందోళనకు దిగారు. జిల్లాలోని గుడూరు నియోజకవర్గ పరిధిలో ఉన్న తీరప్రాంత వరద బాధితులు వాకాడు తహసీల్దార్, మండల అభివృద్ధి కార్యాలయాలను ముట్టడించారు. తుపాన్ బాధితులను ఆదుకోవడానికి ఒక్కో కుటుంబానికి రూ. 2500 నగదు, బియ్యం, కందిపప్పు వంటి నిత్యవసరాలను అందిస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. అయినా ఇప్పటివరకు సహాయం అందలేదని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
వాకాడు మండలంలో 41 గ్రామాలు ఉండగా కొంతమందికి మాత్రమే పరిహారం చెల్లించారని తెలిపారు. మిగిలిన తమ పరిస్థితి ఏమిటంటూ రెవెన్యూ సిబ్బందిని నిలదీశారు. దీంతో అక్కడ కొంత ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. తుపానుతో నష్టపోయిన తమకు పరిహారం అందలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తుపాను బాధితులు కార్యాలయాలను ముట్టడించడంతో సిబ్బంది విధులకు వెళ్లలేకపోయారు. గూడూరు ఆర్డీవో వచ్చి తమ సమస్యకు స్పష్టమైన హామీ ఇవ్వాలని బాధితులు డిమాండ్ చేశారు.