Challenge: అనకాపల్లిలో రంగురాళ్ల వివాదం.. నేతల సవాళ్లు - నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్
🎬 Watch Now: Feature Video
Quarrying of colored stones : అనకాపల్లి జిల్లా గొలుగొండ మండలం సాలికమర్లవరం వద్ద రిజర్వ్ ఫారెస్ట్‌లో అక్రమంగా రంగురాళ్ల తవ్వకాలు జరుగుతున్నాయని మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు చింతకాయల అయ్యన్నపాత్రుడు అన్నారు. దానిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని.. ఈ ఘటనలో ఎవరెవరికి సంబంధం ఉందో అందరిపైనా విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు.
ఈ మేరకు అనకాపల్లిలో ఆయన వీడియో విడుదల చేశారు. ఈ రంగురాళ్ల తవ్వకం ఘటనలో అటవీ, పోలీస్ శాఖ అధికారుల ప్రమేయం ఉందనే అనుమానాలు ఉన్నాయని.. ఈ నేపథ్యంలో సర్కిల్ ఇన్స్పెక్టర్, ఎస్సై, అటవీ శాఖ అధికారుల ఫోన్లను తక్షణమే స్వాధీనం చేసుకొని విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. అవసరమైతే దీనిపై సుప్రీంకోర్టుకు వెళ్తామని అయ్యన్నపాత్రుడు స్పష్టం చేశారు. రంగురాళ్ల తవ్వకందారుల వెనుక స్థానిక ఎమ్మెల్యే హస్తము ఉందని అయ్యన్నపాత్రుడు ఆరోపించారు దీంతోపాటు లెటరైట్ తవ్వకాలు అక్రమ గంజాయి రవాణా తదితర కేసులపై తక్షణమే విచారణ జరిపించాలని అయ్యన్న డిమాండ్ చేశారు.
స్పందించిన ఎమ్మెల్యే గణేష్..
అయ్యన్నపాత్రుడు చేసిన రంగురాళ్ల తవ్వకాల వ్యాఖ్యలపై ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ స్పందించారు. దీనికి సంబంధించి తనపై కొంతమంది తెలుగుదేశం పార్టీ నాయకులు ఆరోపణలు చేస్తున్నారని.. విలేకరులకు వీడియో విడుదల చేశారు. అలాగే రంగురాళ్ల తవ్వకాలు జరిపి ఒక్క రూపాయి అయినా సంపాదించినట్టు నిరూపిస్తే తక్షణమే రాజకీయాల నుంచి తప్పకుంటానని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. అంతేకాకుండా ఈ విషయంలో డబ్బులు సంపాదించినట్టు నిరూపించకపోతే అయ్యన్నపాత్రుడు రాజకీయాల నుంచి తప్పకుంటారా.. అని ఆయన సవాల్ విసిరారు. తమ ప్రభుత్వంపై లేనిపోని ఆరోపణలు చేసి బురద జల్లడమే లక్ష్యంగా అయ్యన్నపాత్రుడు చూస్తున్నారని ఎమ్మెల్యే గణేష్ పేర్కొన్నారు.
ఇవీ చదవండి: