ఆ జిల్లా ఓటరు జాబితాలో సీఎం జగన్ ఫొటో - ఖంగుతిన్న అసలు ఓటరు - CM Jagan Photo in woman voter place
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Nov 7, 2023, 1:40 PM IST
CM Jagan Photo in Prakasam District Voter List: ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం నియోజకవర్గంలోని ఓటర్ల జాబితాల్లో సీఎం జగన్ ఫొటో ఉండడం సంచలనం రేపింది. దోర్నాల మండలం వై చెర్లోపల్లిలో జనపతి గురవమ్మ అనే మహిళ ఓటర్ స్థానంలో సీఎం జగన్ ఫొటో ఉంది. సదరు మహిళకు ఆ విషయం తెలియడంతో తమ ఫోటో కాకుండా జగన్ ఫొటో రావడం ఏంటని ఖంగు తిన్నారు. బీఎల్వో తప్పిదంతోనే ఇది జరిగినట్లు స్థానికులు ఆరోపించారు. అదే గ్రామంలో మరి కొందరి ఫొటో స్థానంలో ఏకంగా ఆధార్ కార్డ్ అప్లోడ్ చేశారు. ఓటర్ల లిస్ట్ లో తప్పిదాలపై ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
ఇప్పటికే బీఎల్వోలు సక్రమంగా విధులు నిర్వహించడం లేదని.. ఓటరు జాబితాలో అనేక లోపాలు తలెత్తున్నాయని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. ప్రతిపక్షాలకు అనుకూలంగా ఉన్నవారి ఓట్లను తొలగిస్తున్నారని.. మరణించిన వారి ఓట్లు జాబితా నుంచిి తొలగించలేదని.. ఒకే ఇంటి నెంబర్‌పై పదుల సంఖ్యలో ఓట్లు నమోదు అయ్యాయని అంటున్నాయి. ఇవన్నీ ఎన్నికల సంఘం దృష్టికి తీసుకువెళ్తామని ప్రతిపక్షాలు చెప్తున్నాయి.