CM Jagan Paid Tribute to YS Rajasekhar Reddy: దివంగత సీఎం వైఎస్‌కు వేర్వేరుగా నివాళులు అర్పించిన జగన్, షర్మిల.. - YS Rajasekhar Reddy 14th death anniversary updates
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 2, 2023, 5:33 PM IST
CM Jagan Paid Tribute to Former Chief Minister YS Rajasekhar Reddy: దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 14వ వర్ధంతి సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సతీసమేతంగా మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు ఇడుపులపాయకు వెళ్లి.. వైఎస్ ఘాట్ వద్ద నివాళులు అర్పించారు. అనంతరం తండ్రి సమాధి వద్ద నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్న సీఎం.. సమాధిపై పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. మరోవైపు వైఎస్ రాజశేఖర్‌రెడ్డి వర్ధంతిని పురస్కరించుకుని వైఎస్ షర్మిల ఈరోజు ఉదయం..తల్లి విజయమ్మతో కలిసి నివాళులు అర్పించారు. ఆ తర్వాత సమాధి వద్ద ప్రార్థనలు చేసిన షర్మిల తిరిగి హైదరాబాద్‌కు వెళ్లిపోయారు.
షర్మిల కాంగ్రెస్‌లో చేరడంపై విజయమ్మతో జగన్ చర్చ!: అయితే.. కుమారుడు, కుమార్తె వేర్వేరుగా నివాళులు అర్పించినప్పటికీ.. ఇద్దరి సమక్షంలో తల్లి విజయమ్మ పాల్గొన్నారు. వీరితోపాటు వైఎస్సార్సీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ ముఖ్యనేతలు పాల్గొని.. వైఎస్‌కు నివాళులర్పించారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది జులై 8న వైఎస్ జయంతి రోజున కూడా ఇడుపులపాయలో జగన్, షర్మిల వేర్వేరుగా నివాళులర్పించారు. ఇవాళ వర్ధంతి సందర్భంగానూ ఇద్దరూ వేర్వేరుగా నివాళులు అర్పించడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. షర్మిల కాంగ్రెస్‌లో చేరుతున్నారన్న ప్రచారంపై తల్లి విజయమ్మతో జగన్ ఇడుపులపాయలో కాసేపు చర్చించినట్లు సమాచారం.