సీఎంవోకు ఎంపీ గోరంట్ల మాధవ్ - అపాయింట్మెంట్ ఇవ్వని జగన్ - ఏపీ తాజా వార్తలు
🎬 Watch Now: Feature Video


By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 3, 2024, 7:21 PM IST
CM Jagan No Appointment to MP Gorantla Madhav: ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో వైసీపీలో ఇంఛార్జ్‌ల మార్పు ఆ పార్టీ నేతల్లో కలవర పెడుతోంది. తన టికెట్టు విషయంలో చర్చించేందుకు మరోసారి ఎంపీ గోరంట్ల మాధవ్ సీఎం జగన్‌ను కలిసేందుకు క్యాంపు కార్యాలయానికి వచ్చారు. తాజాగా వైసీపీలో చేసిన మార్పుల్లో హిందూపురం ఎంపీ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌గా మాధవ్‌ను తప్పించారు. బాధ్యతల నుంచి తప్పించడంపై అసంతృప్తితో ఉన్న మాధవ్ సీఎంను కలిసి తన సీటు విషయమై చర్చించేందుకు వచ్చారు. అయితే సీఎంను కలిసే అవకాశం ఇవ్వకపోవడంతో గోరంట్ల వెనుతిరగక తప్పలేదు.
ఇటీవల వైసీపీ చేసిన మార్పుల్లో గోరంట్ల మాధవ్ ఎంపీగా ఉన్న హిందూపురం నియోజకవర్గానికి మహిళను ఇంఛార్జ్‌గా ప్రకటించారు. వైసీపీ ఇంఛార్జిగా బళ్లారికి చెందిన బీజేపీ మాజీ ఎంపీ శాంతను నియమించారు. ఎంపీ స్థానం నుంచి గోరంట్లకు బదులుగా పార్టీలోకి కొత్తగా వచ్చిన శాంతకు అవకాశం ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. వచ్చే ఎన్నికల్లో హిందూపురం నుంచి వైసీపీ అభ్యర్థిగా శాంతమ్మ పోటీ చేయనున్నారని వైసీపీ అధిష్టానం ప్రకటించింది. దీంతో గోరంట్ల మాధవ్‌కు నిరాశ తప్పలేదు.