CM Jagan Lies In Venkatanayunipalli Meeting : ప్రజలను మభ్యపెట్టడంలో మనకు మనమే పోటీ.. మనకు ఎవరూ రారు సాటీ!..జగన్ వ్యవహారంపై విమర్శలు - jaGun Comments
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 20, 2023, 9:56 AM IST
CM Jagan Lies In Venkatanayunipalli Meeting : నంద్యాల జిల్లాలో వెంకటనాయునిపల్లెలో నిర్వహించిన సభలో సీఎం జగన్ అసత్యాలతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేశారు. పలు అబద్ధాలను సీఎం అలవోకగా చెప్పడంతో జనం నివ్వెరపోయారు. హంద్రీనీవా కాలువ నుంచి 77 చెరువులకు నీరందించే ప్రాజెక్టు (CM Jagan to Release Water to 77 Ponds in Kurnool) పూర్తయిందని సీఎం ప్రకటించారు. వాస్తవానికి 68 చెరువులకు నీరిస్తామన్న అధికారులు వాటికీ పూర్తి స్థాయిలో పైపులైన్లు ఇప్పటికీ వేయలేకపోయారు.
ఊదరగొట్టడంలో తనకు మరెవరూ సాటి రారు అనే విధంగా సీఎం వ్యవహరిస్తున్నారు. ఎందుకంటే రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులు వేగవంతంగా సాగుతున్నాయని సభలో ముఖ్యమంత్రి ప్రకటించారు. ఆ పథకం పనులు క్షేత్ర స్థాయిలో జరుగుతున్న దాఖలాలే లేవు. ప్రాజెక్టు పూర్తి కావడానికి పలు సాంకేతిక అవాంతరాలు ఉన్నాయి.
"నేను చెబుతున్నాను మీరు నమ్మండి.. ఇంకేం ఆలోచించకండి" అన్నట్లు ఉంది మన ముఖ్యమంత్రి తీరు. అప్పుల్లో వృద్ధి రేటు ప్రస్తుత ప్రభుత్వ హయాంలోనే తక్కువని పేర్కొనడము విస్మయానికి గురి చేసింది. రాష్ట్ర ప్రభుత్వ మొత్తం అప్పు 10.77 లక్షల కోట్లకు చేరిందని.. ఇది ఆందోళనకర విషయమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి ఇటీవల గవర్నర్‌కు సైతం లేఖ రాశారు.
గాజులదిన్నె ప్రాజెక్టు సామర్థ్యాన్ని 4.5 T.M.Cల నుంచి 5 T.M.C లకు పెంచామని జగన్ ప్రకటించారు. పెంచిన సామర్థ్యానికి అనుగుణంగా గేట్లు ఏర్పాటు చేసే ప్రక్రియ నేటికీ జరుగుతూనే ఉంది.