CM Jagan Letter to Central Govt on Jahnavi Death: జాహ్నవి మృతి ఘటనపై కేంద్రానికి సీఎం జగన్ లేఖ - news on Jagan seeks Jaishankar intervention

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 14, 2023, 8:59 PM IST

  CM Jagan Letter on Jahnavi Death Central Govt: ఏపీకి చెందిన విద్యార్ధిని కందుల జాహ్నవి అమెరికాలో మృతి చెందిన ఘటనపై సమగ్ర విచారణ జరిపి కుటుంబానికి న్యాయం చేయాలని కేంద్రాన్ని మఖ్యమంత్రి వైఎస్ జగన్ కోరారు. ఈమేరకూ కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి డాక్టర్‌ ఎస్‌. జై శంకర్‌ (Jaishankar)కు సీఎం వైఎస్‌ జగన్‌ లేఖ (CM Jagan Letter) రాశారు. జనవరి 23, 2023న రోడ్డు దాటుతుండగా వేగంగా వస్తున్న పోలీస్‌ వాహనం ఢీకొట్టి జాహ్నవి ప్రాణాపాయానికి గురైందని, కందుల జాహ్నవి మరణంపై దర్యాప్తు చేస్తున్న ఒక పోలీస్‌ అధికారి ఆమె మరణాన్ని అపహాస్యం చేస్తున్నట్లు వీడియో వచ్చిందని లేఖలో సీఎం తెలిపారు. వీడియోలో ఒక అమాయక విద్యార్ధి జీవితాన్ని తక్కువ చేసి మాట్లాడారని, నాన్‌ అమెరికన్ల పట్ల అలాంటి అధికారుల అమానవీయ ప్రవర్తనను అందరూ ఖండించాలన్నారు. 

తప్పు చేసిన పోలీసులపై కఠిన చర్యలకు సిఫార్సు చేయాలని సీఎం కోరారు. భారతీయులలో విశ్వాసం, భరోసా కల్గించేలా చర్యలు ఉండాలని కోరుకుంటున్నానన్న సీఎం తెలిపారు. ఈ విషయంలో వ్యక్తిగతంగా జోక్యం చేసుకోవాలని కేంద్ర మంత్రిని జగన్  కోరారు. ఈ దురదృష్టకర పరిస్ధితిపై సమగ్ర దర్యాప్తు జరపాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. అమెరిగాలోని సంబంధిత అధికారులతో తక్షణమే చర్చించి, వాస్తవాలు వెలికితీసి.. మృతురాలి కుటుంబానికి న్యాయం జరగేలా చర్యలు చేపట్టాలని కోరారు. భారతదేశంలోని అమెరికా రాయబారితోనూ చర్చించి తగిన సూచనలివ్వాలని కోరుకుంటున్నట్లు జగన్  తెలిపారు. ఈ విషయాన్ని అత్యవసరంగా పరిగణించి కందుల జాహ్నవి (Jahnavi) కుటుంబానికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని సీఎం జగన్  కోరారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.