Cm Jagan Kurnool Distrcit Tour: కర్నూలు జిల్లాలో సీఎం జగన్ పర్యటన.. సర్పంచులను పోలీస్ స్టేషన్లకు తరలింపు.. - హంద్రీనీవా కాలువ నుంచి చెరువులకు నీళ్లు
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 19, 2023, 9:44 AM IST
Cm Jagan Kurnool Distrcit Tour: ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఇవాళ ముఖ్యమంత్రి జగన్ పర్యటించనున్నారు. ఓర్వకల్లు నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి కృష్ణగిరి మండలం లక్కసాగరానికి చేరుకుంటారు. ఉదయం 10గంటల 25 నిమిషాలకు.. హంద్రీనీవా కాలువ నుంచి 77 చెరువుల్లో నీళ్లు నింపే కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించనున్నారు. అనంతరం డోన్, పత్తికొండ, ఆలూరు, పాణ్యం నియోజకవర్గాలకు సంబంధించి తాగు, సాగు నీటి పనులను ప్రారంభిస్తారు. అక్కడి నుంచి నంద్యాల జిల్లా డోన్ వెళ్లనున్నారు. ఉదయం 10గంటల 55 నిమిషాలకు.. వెంకటనాయునిపల్లిలో జరిగే బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో సర్పంచులను ముందస్తుగా అరెస్టులు చేశారు. సమస్యల పరిష్కారం కోసం సీఎంను కలిసేందుకు అవకాశం ఇవ్వాలని సర్పంచ్‌లు కలెక్టర్‌కు విన్నవించారు. దీనిపై కలెక్టర్ స్పందిస్తూ వారి విన్నపాన్ని తిరస్కరించారు. దీంతో ముఖ్యమంత్రి పర్యటనను అడ్డుకుంటారనే ఉద్దేశంతో పోలీసులు సర్పంచులను స్టేషన్లకు తరలించారు. అరెస్టులతో ఆందోళనను అణచివేయలేరని సర్పంచ్‌ల సంఘం నేతలు స్పష్టం చేశారు.