తిరువూరు అధికార వైసీపీలో వర్గ విభేదాలు.. కౌన్సిల్​ సమావేశానికి కౌన్సిలర్లు గైర్హాజరు - ఏపీ తాజా వార్తలు

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : May 31, 2023, 3:26 PM IST

Class War In YSRCP at Tiruvuru: ఎన్టీఆర్​ జిల్లా తిరువూరులోని అధికార వైసీపీలో వర్గవిభేదాలు బయటపడ్డాయి. అధికార మార్పిడి వల్ల వైసీపీలోని వర్గ విభేదాలు వెలుగులోకి వచ్చింది. పురపాలక సంఘం సమావేశానికి కౌన్సిలర్లు కౌన్సిల్​ సమావేశానికి హాజరుకాకపోవటంతో వర్గపోరు స్పష్టమవుతోంది. తిరువూరు మున్సిపల్ చైర్​ పర్సన్​ పదవి రెండేళ్ల ఒప్పందం అమలు చేయకపోవటంతో అధికార పార్టీ సభ్యులు కౌన్సిల్​ సమావేశానికి గైర్హాజరయ్యారు. మొత్తం 17 మంది వైసీపీ కౌన్సిలర్లు ఉండగా.. వారిలో చైర్​ పర్సన్​తో కలిపి ఎనిమిది మంది సభ్యులు మాత్రమే కౌన్సిల్​ సమావేశానికి హాజరయ్యారు. వారి గైర్హాజరుతో కోరం పూర్తి కాలేదు. దీంతో చైర్​ పర్సన్​  గత్తం కస్తూరిబాయి సమావేశాన్ని వాయిదా వేశారు. సమావేశం వాయిదాపై ప్రతిపక్ష సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అధికార వైసీపీలోని వర్గ విభేదాలతో పట్టణంలో అభివృద్ధి కుంటుపడిందని ఆరోపించారు. పలు రకాల సమస్యలతో పట్టణ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని.. ప్లోర్​ లీడర్​ షేక్​ అబ్దుల్​ హూస్సేన్​ విమర్శించారు. అసలు పరిపాలనను పట్టించుకున్న వారే లేరని మండిపడ్డారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.