ఉద్రిక్తత: ప్రభుత్వ భూమిలో గుడిసెలు.. పోలీసులు వర్సెస్ స్థానికులు - ap latest telugu news
🎬 Watch Now: Feature Video
Land Irregularities : నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలో భూ వివాదంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది. మొదట ఓ వర్గం వారు ప్రభుత్వ భూమిలో గుడిసెలు వేసుకోగా.. మిగిలిన స్థలంలో మరో వర్గం వారు ఇదే తీరులో గుడిసెలు వేసేందుకు ప్రయత్నించారు. దీంతో ఇరువర్గాల మధ్య ఘర్షణలు చెలరేగాయి. దీంతో భారీగా పోలీసులు మోహరించారు.
నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని కొత్తూరు గ్రామ సమీపాన గల ఐదేకరాల ప్రభుత్వ స్థలంలో.. దళిత సంఘాల అధ్వర్యంలో కొందరు పేదలు గుడిసెలు వేశారు. ఈ విషయం తెలుసుకున్న మరో వర్గం వారు మిగిలిన భూమిలో గుడిసెలు వేసేందుకు ప్రయత్నించారు. దళిత సంఘాల అధ్వర్యంలో గుడిసెలు వేసిన పేదలు.. మరో వర్గం వారు గుడిసెలు వేయటాన్ని అడ్డుకున్నారు. గుడిసెలు వేయటం అడ్డుకోవటంతో ఇరు వర్గాల మధ్య తీవ్ర స్థాయిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఓ క్రమంలో ఇరు వర్గాల వారు దాడులకు దిగారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్న ఇరువర్గాల వారిని అక్కడి నుంచి పంపించేశారు. దీంతో గొడవ సద్దుమణిగింది. రెండవసారి గుడిసెలు వేయటానికి ప్రయత్నించిన వర్గం వారకి.. అధికార పార్టీ నేత అండదండలున్నాయనే ఆరోపణలు ఉన్నాయి.