కాకినాడలో లారీ యజమానుల ఘర్షణలో రెచ్చిపోయిన ఎమ్మెల్యే ద్వారంపూడి వర్గం - latest news
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/02-11-2023/640-480-19924018-thumbnail-16x9-clash-between-lorry-owners.jpg)
![ETV Bharat Andhra Pradesh Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/andhrapradesh-1716535904.jpeg)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Nov 2, 2023, 5:47 PM IST
Clash between lorry owners in Kakinada: కాకినాడలో లారీ యజమానుల మధ్య తీవ్రస్థాయిలో ఘర్షణ జరిగింది. వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి అనుకూల వర్గం లారీ యజమానులు... వ్యతిరేక వర్గీయులపై దాడి చేశారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా లారీ యజమానుల సంఘం అధ్యక్షుడిగా తాను ఉండగా కొత్తవారిని ఎలా నియమిస్తారని నిన్న దుగ్గన బాబ్జీ ప్రశ్నించారు. ఎమ్మెల్యే ద్వారంపూడి రౌడీయిజానికి భయపడేది లేదన్నారు. 24 గంటలు గడవక ముందే ప్రెస్‌మీట్ పెట్టిన కొత్త అధ్యక్షుడు ఎన్ఎస్ రాజు... దుగ్గన బాబ్జీపై అవినీతి ఆరోపణలు చేశారు. ఆ సమయంలో అక్కడే ఉన్న బాబ్జీ వర్గీయులు... సంఘంలో తమ సభ్యత్వం ఎలా రద్దు చేస్తారని ప్రశ్నించారు.
సరకు రవాణాలో సీరియల్ నెంబర్ కేటాయించకపోవడాన్ని మరో లారీ యజమాని నిలదీశారు. ఈ క్రమంలో వాదనలు తీవ్రమై ఎన్ఎస్ రాజుతోపాటు మరికొందరు కలిసి బాబ్జీ వర్గీయుల్ని తీవ్రంగా కొట్టారు. అనంతరం తమ సభ్యత్వం ఎందుకు రద్దు చేశారని బాబ్జీ వర్గీయులు అధ్యక్షుడు ఎన్ ఎస్ రాజుని నిలదీశారు. దీంతో వివాదం చెలరేగింది. స్వయంగా అధ్యక్షుడు ఎన్ఎస్ రాజుతోపాటు మరికొందరు దుగ్గన బాబ్జీ వర్గీయుల్ని కొట్టడంతో ఆ ప్రాంతంలో కొంత సేపు తీవ్ర ఉద్రిక్తపరిస్థితులు నెలకొన్నాయి.