thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 30, 2023, 4:39 PM IST

ETV Bharat / Videos

Citizens for Democracy Press Meet స్వేచ్ఛాయుత ఎన్నికల కోసమే సిటిజన్స్ ఫర్ డెమెక్రసీ.. ఓటు హక్కుపై అవగాహన కల్పిస్తాం..

Citizens for Democracy Press Meet: స్వేచ్ఛాయుత ఎన్నికల అమలుకు, ప్రజాస్వామ్య పరిరక్షణకు ఏర్పాటైన సిటిజన్స్‌ ఫర్‌ డెమోక్రసీ ఆరంభ సభ విజయవాడ ప్రెస్‌క్లబ్‌లో జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎన్నికల మాజీ ప్రధానాధికారి నిమ్మగడ్డ రమేష్‌, మాజీ సీఎస్ సుబ్రహ్మణ్యం, విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ భవానీ ప్రసాద్‌ సహా.. వివిధ రంగాల్లో సేవలందించిన పలువురు ప్రముఖులు సమావేశమై తమ కార్యచరణ వెల్లడించారు. స్వేచ్ఛగా ఎన్నికలు జరిగితేనే ప్రజాస్వామ్యం బలపడుతుందని రాష్ట్ర ఎన్నికల మాజీ ప్రధానాధికారి, సిటిజన్స్‌ ఫర్‌ డెమోక్రసీ కార్యదర్శి నిమ్మగడ్డ చెప్పారు. 

సీఎఫ్డీ (Citizens for Democracy) సంస్థలోని సభ్యులకు రాజకీయ పార్టీలతో సంబంధం లేదని నిమ్మగడ్డ రమేశ్‌ తెలిపారు. సందర్భానుసారం అన్ని రాజకీయ పార్టీలతో కలిసి పనిచేస్తామని స్పష్టం చేశారు. ప్రభుత్వ ఉద్యోగుల బాధ్యత ఎన్నికల ప్రక్రియలో ఎంతో ఉందని నిమ్మగడ్డ అన్నారు. రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియ గతంలో టీచర్లు చేసేవారని.. ఇప్పుడు గ్రామ సచివాలయ సిబ్బంది, బీఎల్వోలు, వాలంటీర్లు చేస్తున్నారని వ్యాఖ్యానించారు. ఎన్నికల ప్రక్రియకు వాలంటీర్లు దూరంగా ఉండాలని గతంలో ఆదేశించామని పేర్కొన్నారు.  

అదే విధంగా ఈ సమావేశంలో తన ఓటు కోసం తాను ఎంతగా కష్టపడ్డానో చెప్పుకొచ్చారు.  తన సొంత ఊరులో ఓటు హక్కు కోసం పోరాడినట్లు తెలిపారు. కోర్టుకు వెళ్తే పూర్తి ఆధారాలతో దరఖాస్తు సమర్పిస్తే పరిష్కరిస్తామన్నారని.. ఇంటింటికి వచ్చిన సర్వేలో తన ఓటు నేను నమోదు చేసుకున్నట్లు చెప్పారు. ఫారం-12 విచారణకు న్యాయవాదితో కలిసి వెళ్లానని అన్నారు. అన్ని వివరాలు సమర్పించాక తనకు ఓటు హక్కు వచ్చిందని చెప్పారు. అలాగే ఓటు తొలగించడం అంత తేలికైన విషయం కాదని.. ఒక వ్యక్తి మరణించారని నిర్ధరణ అయితేనే ఓటు తొలగిస్తారని నిమ్మగడ్డ రమేష్ అన్నారు.

నిబంధనల ప్రకారమే అధికారులు విధులు నిర్వహించాలని ఎల్వీ సుబ్రమణ్యం సూచించారు. తప్పుచేసినప్పుడు మొట్టికాయ పడితే వారికే అర్థమవుతుందని అన్నారు. చట్టసమ్మతం కాని పనులు చేయమని చెప్పే ధైర్యం అధికారులకు ఉండాలని తెలిపారు. సమాజంలో రుగ్మతలను ప్రజలకు తెలియజేసి.. అవగాహన కల్పిస్తామని జస్టిస్‌ భవానీ ప్రసాద్‌ స్పష్టం చేశారు. యువత పెడదారిన పట్టకుండా అవగాహన కల్పిద్దామని పేర్కొన్నారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.