SRM University Students on Chandrayaan 3: "భవిష్యత్ అంతరిక్ష పరిశోధనల్లో మా వంతు పాత్ర పోషించేందుకు సిద్ధం"
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Aug 26, 2023, 12:27 PM IST
Chitchat with Guntur SRM University Students on Chandrayaan 3: చంద్రయాన్-3 ఈపేరు వింటేనే.. యావత్ భారతావని పులకించిపోతోంది. 140 కోట్ల మంది ప్రజలు.. పెట్టుకున్న నమ్మకాన్ని నిజం చేస్తూ ఇంతవరకూ ఎవరూ చేరలేని చంద్రుడి దక్షిణ ధ్రువంపై చంద్రయాన్-3 ల్యాండర్ దిగిన క్షణాలు.. అంతరిక్ష పరిశోధనల్లో చరిత్ర సృష్టించినట్లైంది. అగ్రరాజ్యలకు సైతం సాధ్యం కాని.. అపురూప ఘట్టాన్ని ఇండియన్ స్పేస్ రీసర్చ్ ఆర్గనైజేషన్(ISRO) ఆవిష్కరించింది. ఈ విజయంతో యావత్ భారతదేశంతో పాటు యువత మరింత ఆనందం వ్యక్తం చేస్తోంది. రానున్న కాలంలో శాస్త్ర, సాంకేతిక రంగాల్లో ప్రపంచ దేశాలన్నింటికీ భారత్ దిక్సూచిగా నిలుస్తోందని యువత ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. భవిష్యత్ తరాలకు ఉపయోగపడేలా సాగిన చంద్రయాన్-3 ప్రయాణం తమలో స్ఫూర్తిని నింపింది అంటోంది యువత. ఈ నేపథ్యంలో భవిష్యత్తులో జరిగే అంతరిక్ష పరిశోధనల్లో తమ వంతు పాత్ర పోషించేందుకు సిద్ధమంటున్న ఎస్ఆర్ఎమ్ యూనివర్సిటీ యువ ఇంజనీర్లతో ప్రత్యేక ముఖాముఖి ఇప్పుడు చూద్దాం.