Cheetah Died under Suspicious Circumstance: పొలాల్లో చిరుత కళేబరం.. అటవీ అధికారులకు సమాచారమిచ్చిన రైతు - cheetah suspicious death news in sri satyasai
🎬 Watch Now: Feature Video
Cheetah Died under Suspicious Circumstance in Madakasira : శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర మండలంలో అనుమానాస్పద స్థితిలో చిరుత మృతి చెందింది. నోటి నుంచి తెల్లటి నురుగుతో పొలంలో రైతుకు చిరుత కళేబరం కనిపించింది. చిరుతను చూసిన రైతు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించాడు. అధికారులు ఘటనా స్థలానికి వచ్చి చిరుత మృతికి గల కారణాలను పరిశీలిస్తున్నారు. పొలాల్లో ఎలుకలు లేదా ఏదైనా వాటికోసం రైతులు రసాయనిక ఎరువులు లాంటివి వాడతారు. ఈ నేపథ్యంలో వాటిని తిని ఈ చిరుత మృతి చెంది ఉండొచ్చని అధికారులు అనుమానాలు వ్యక్తం చేశారు. మడకశిర ప్రాంతంలో వన్యప్రాణుల సంచారం ఎక్కువగా ఉంటుంది. ఈ ప్రాంతంలో వన్యప్రాణులకు, మానవ ప్రాణాలకు ఎలాంటి హాని జరగకుండా అధికారులు చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. అటవీ ప్రాంతం తగ్గిపోటం వల్ల జంతువులు జనావాసాల సమీపంలోకి తరచూ వస్తున్నాయి. ఇటీవల రోడ్లపై, పొలాల్లో, ఎక్కడపడితే అక్కడ పులులు, ఏనుగులు కనిపిస్తున్నాయి. ఇలా జన సంచారంలోకి రావటం వల్ల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఇప్పటికైన అటవీశాఖ అధికారులు వన్య ప్రాణులకు, ఇటు జంతువుల నుంచి ప్రజలకు ఎలాంటి హాని కలగకుండా చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.