cheating woman in Nandyal :అందరితో సన్నిహితంగా ఉంటూ.. రూ.5వడ్డీ అంటూ.. ఆ మహిళ ఏం చేసిందంటే..! - woman who collected 50 lakhs by saying magic words
🎬 Watch Now: Feature Video
woman ran with money in Nandyal District : అధిక వడ్డీ ఆశ చూపి దాదాపు రూ.50 లక్షలు వసూలు చేసుకొని మహిళ ఉడాయించిన ఘటన నంద్యాల జిల్లాలో జరిగింది. డోన్ పట్టణంలోని వైయస్ నగర్ చెందిన శ్రీ ప్రియ అందరితో సన్నిహితంగా ఉంటూ కాలనీలోని మహిళలకు ఐదు రూపాయల వడ్డీ ఆశచూపి దాదాపు రూ.50 లక్షలకు పైగా వసూలు చేసింది. కాలనీలో ఉంటున్న మహిళలు, యువకులకు మాయ మాటలు చెప్పి వసూలు చేసిన డబ్బుతో గుట్టుగా ఉడాయించింది. చివరికి తన ఇంట్లో పని చేసే పనిమనిషిని సైతం వదలకుండా పక్కా ప్రణాళికతో మోసం చేసింది. నెల రోజులుగా ఇంటికి తాళం వేయడంతో పాటు సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేయడంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. నెల రోజుల క్రిితమే ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు సకాలంలో స్పందించి ఉంటే తమకు న్యాయం జరిగేదని కన్నీటి పర్యంతమయ్యారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి ఆ మాయ లేడి పై కేసు నమోదు చేసి తమకు న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు.