MLA Chevireddy In kothasanambhatla వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి చేదు అనుభవం.. ఏమైందంటే..! - Mystery fires in Kothasanambatla village
🎬 Watch Now: Feature Video
MLA Chevireddy Bhaskar Reddy had a bitter experience: తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం కొత్తసానంబట్ల గ్రామంలో ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. గ్రామంలో జరుగుతున్న మిస్టరీ మంటలపై సందర్శనకు కలెక్టర్‌తో పాటు వెళ్లిన ఎమ్మెల్యే మాట్లాడుతూ 2019 నుంచి గ్రామ అభివృద్ధికి రూ 3.38 కోట్లు ఖర్చు పెట్టినట్లు చెప్పడంతో మా ఊరికి ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేదని గ్రామస్తుడు నారాయణ రెడ్డి స్పష్టం చేయడంతో ఎంఎల్ఎతో పాటుగా అధికారులు ఖంగుతిన్నారు. దీనితో అధికారులు ప్రజలకు లెక్కలు చెప్పే ప్రయత్నం చేశారు. ఎంఎల్ఎ కలుగజేసుకొని చేసిన అభివృద్ది పనులను కాగితంపై రాసి ఇంటి ఇంటికి పంపుతానని తెలిపారు. మీకు ఇంకా తుడ నిధులు మంజూరు చేస్తానని వాటితో మీ గ్రామంలో మీరే అభివృద్ది పనులు చేసుకోవాలని కోరారు. దీనితో ఈ గ్రామంలో పాడి రైతులు ఎక్కువగా ఉన్నారని గత నాలుగు సంవత్సరాలుగా అడుగుతున్నా పట్టించుకున్న పాపాన పోలేదు అని ప్రజలు వాపోయారు. ఆరు నెలల్లో ఇన్ని పనులు ఎలా సాద్యపడుతాయో ఆయనే చెప్పాలంటూ గ్రామస్తులు ప్రశ్నించారు.